Share News

Miss World 2025: ఘనంగా ‘బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌’ గాలా

ABN , Publish Date - May 27 , 2025 | 05:00 AM

మేఘా కృష్ణారెడ్డి సతీమణి, సుధారెడ్డి ఫౌండేషన్‌ అధినేత్రి సుధారెడ్డి సోమవారం రాత్రి మిస్‌ వరల్డ్‌ పోటీదారుల కోసం ప్రత్యేకంగా ‘బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌’ గాలాను నిర్వహించారు.

Miss World 2025: ఘనంగా ‘బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌’ గాలా

  • ‘మేఘా’ సుధారెడ్డి నివాసంలో నిర్వహణ

  • హాజరైన మిస్‌ వరల్డ్‌ పోటీదారులు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మే 26 (ఆంధ్రజ్యోతి): మేఘా కృష్ణారెడ్డి సతీమణి, సుధారెడ్డి ఫౌండేషన్‌ అధినేత్రి సుధారెడ్డి సోమవారం రాత్రి మిస్‌ వరల్డ్‌ పోటీదారుల కోసం ప్రత్యేకంగా ‘బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌’ గాలాను నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన ఈ గాలాలో మిస్‌ వరల్డ్‌ పోటీదారులతో పాటు మిస్‌ వరల్డ్‌ సంస్థ చైర్‌పర్సన్‌ జులియా మోర్లీ, దేశంలోని రాజ కుటుంబాల ప్రతినిధులు రాధిక రాజే గైక్వాడ్‌ (బరోడా), కున్వరాణి రీతూ అజాతశత్రు సింగ్‌ (జమ్మూ కశ్మీర్‌), కృష్ణకుమారి (జోధ్‌పూర్‌), పూజా పద్మరాజే పట్వర్థన్‌ (సాంగ్లీ), పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌తో పాటు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు పాల్గొన్నారు.


తెలంగాణతోపాటు భారతీయ వంటకాలు, సంగీతం, సంస్కృతిని తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సుధారెడ్డి తెలిపారు. ఒకవైపు తెలంగాణ వంటకాల ఘుమఘుమలు, మరోవైపు తబలా కచేరీ అలరించాయి.


Also Read:

సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

For More Health News and Telugu News..

Updated Date - May 27 , 2025 | 05:00 AM