Miss World 2025: రేపే మిస్ వరల్డ్-2025 ఫైనల్
ABN , Publish Date - May 30 , 2025 | 04:10 AM
గత మూడు వారాలుగా కొనసాగుతున్న ప్రపంచ అందాల పోటీలు తుది దశకు చేరుకున్నాయి. శనివారం సాయంత్రం మిస్ వరల్డ్-2025 ఫైనల్ కోసం నగరం సిద్ధమైంది.
హైటెక్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా వేదిక .. మల్టీ మీడియా చాలెంజ్‌లో విజేతలుగా నలుగురు
హైదరాబాద్, మే 29(ఆంధ్రజ్యోతి): గత మూడు వారాలుగా కొనసాగుతున్న ప్రపంచ అందాల పోటీలు తుది దశకు చేరుకున్నాయి. శనివారం సాయంత్రం మిస్ వరల్డ్-2025 ఫైనల్ కోసం నగరం సిద్ధమైంది. సాయంత్రం 6 గంటల నుంచి హైటెక్స్‌లో జరగనున్న ఈ పోటీల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన ప్రత్యేక డిజైనర్లు ప్రధాన వేదికను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. శనివారం వేడుకల్లో భాగంగా.. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఇషాన్ ఖట్టర్‌తో పాటు పలువురు నటులు నృత్యప్రదర్శన ఇవ్వనున్నారు.
ఫైనల్ పోటీల్లో న్యాయనిర్ణేతలుగా ప్రముఖ నటుడు సోనూ సూద్, మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. కాగా.. ఏటా మిస్ వరల్డ్ ఫైనల్లో ఇచ్చే మానవతావాది (హ్యుమానిటేరియన్) పురస్కారాన్ని ఈసారి సోనూసూద్‌కు ఇవ్వనున్నారు. అలాగే రెండు రోజుల క్రితం నిర్వహించిన ‘మల్టీమీడియా చాలెంజ్’ విజేతలను మిస్ వరల్డ్ సంస్థ గురువారం రాత్రి ప్రకటించింది. ఇందులో నాలుగు ఖండాల నుంచి నలుగురు విజేతలున్నారు. ఏషియా-ఓషియానా నుంచి థాయ్‌లాండ్, యూరప్ నుంచి మాంటేనెగ్రో, ఆఫ్రికా నుంచి కామెరూన్, అమెరికా-కరేబియన్ నుంచి డొమినికన్ రిపబ్లిక్ దేశాల ప్రతినిధులు ఇందులో విజేతలుగా నిలిచారు. దీంతో ఫైనల్‌లో టాప్-40లో వీరి స్థానం ఖరారైంది.
‘మిస్ వరల్డ్’కు రూ.300 కోట్లా..?
మహిళా హక్కుల ఉద్యమకారుల ధ్వజం
హైదరాబాద్ సిటీ, మే 29 (ఆంధ్రజ్యోతి): ‘ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర పైసల్లేవ్.. కానీ, మిస్ వరల్డ్ అందాల పోటీలకు మాత్రం రూ.300 కోట్లు ఖర్చుపెడతారా?’అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై మహిళా హక్కుల ఉద్యమకారులు మండిపడ్డారు. మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మిస్ వరల్డ్ పోటీల వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీకి ఆయా సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. శనివారం జరిగే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్
గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే
Read Latest Telangana News And Telugu News