Miss World 2025: పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధ్యమే!
ABN , Publish Date - May 29 , 2025 | 04:10 AM
చెక్ రిపబ్లిక్‌లోని ఓ గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించా. బాల్యమంతా పంట పొలాల మధ్య గడిపా. మిస్ వరల్డ్ విజేతగా నిలవడం జీవితాశయంగా పెట్టుకున్నా. కష్టపడి దాన్ని సాధించా’అని మిస్ వరల్డ్-24 విజేత క్రిస్టినా ప్లిస్కోవా చెప్పారు.
నేను సాధించా.. మీరూ సాధించవచ్చు
అనాథలతో మిస్‌వరల్డ్ క్రిస్టినా ప్లిస్కోవా
200 మంది పిల్లలకు రూ.2 కోట్లు సాయం అందించిన 2 సంస్థలు
హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): ‘చెక్ రిపబ్లిక్‌లోని ఓ గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించా. బాల్యమంతా పంట పొలాల మధ్య గడిపా. మిస్ వరల్డ్ విజేతగా నిలవడం జీవితాశయంగా పెట్టుకున్నా. కష్టపడి దాన్ని సాధించా’అని మిస్ వరల్డ్-24 విజేత క్రిస్టినా ప్లిస్కోవా చెప్పారు. గ్రామీణ నేపథ్యమని, రైతు కుటుంబమని బాధపడుతూ కూర్చుంటే అక్కడే ఉండేదాన్నని.. పట్టుదలతో శ్రమించాను కాబట్టే అనుకున్న లక్ష్యాన్ని సాధించానన్నారు. ‘హార్ట్ ఆఫ్ గోల్డ్’ పేరిట బుధవారం ట్రైడెంట్ హోటల్‌లో అనాథ పిల్లల కోసం నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమంలో మిస్ వరల్డ్ ప్రతినిధులు పాల్గొన్నారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల ఐసీడీఎస్ బాలసదన్లలోని అనాథ పిల్లలతో మిస్ వరల్డ్ ప్రతినిధులు ముచ్చటించారు.
ఈ సందర్భంగా మిస్ వరల్డ్ క్రిస్టినా ప్లిస్కోవా పిల్లలకు స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. ‘ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని కష్టపడి పనిచేస్తే మీరు కూడా ఏదైనా సాధించవచ్చు’అని పిల్లలతో చెప్పారు. మిస్ వరల్డ్ పోటీదారులు వారితో కలిసి ఆటలాడుతూ, పాటలుపాడుతూ ఉల్లాసంగా గడిపారు. చి న్నారులతో సెల్ఫీ, వీడియోలు తీసుకున్నారు. లైవ్ బ్యాండ్ సంగీతానికి వారు చిన్నారులతో కలిసి డాన్స్ చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ, సుదీక్ష ఎస్టేట్స్ సంస్థలు మిస్‌వరల్డ్ సంస్థతో కలిసి బాలసదన్లలోని 200మంది అనాథ పిల్లలకు ఏడాది పాటు సహాయం చేస్తామని ప్రకటించాయి. 2కోట్ల నిధులు అందించాయి. మిస్ వరల్డ్ ప్రతినిధులు 200మంది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.25వేల విలువైన బహమతులను అందించారు.
Also Read:
తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే
For More Telangana News and Telugu News..