Home » Minister Narayana
శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం పురాతనమైన, పవిత్రమైన ఆలయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో దేవాలయాలకు భద్రత కొరవడిందని.. విధ్వంసాలు సృష్టించారని ధ్వజమెత్తారు.
వీఎంఆర్డీఏ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్‌పై పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ విషయంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
కోవూరు నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సెజ్‌లో టీడీపీ మహానాడు ఏర్పాట్లకు వైభవంగా భూమి పూజ జరిగింది. భూమి పూజలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ, నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.
రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఆర్డీఏ కార్యాలయంలో త్రీమెన్ కమిటీ సమావేశమైంది. రాజధాని గ్రామాల సమస్యలపై, ఎన్ఎస్పీ ప్రభావిత బాధితుల ఇళ్ల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
ఏపీపై గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం మోపి వెళ్లిందని మంత్రి నారాయణ విమర్శలు గుప్పించారు. పరిశ్రమలు వెళ్లిపోయాయని, రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. అప్పులు తీరుస్తూ అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది నిర్వహించే మహానాడును ఈ సారి నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు.
తనపై, ప్రభుత్వంపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండ తీవ్రత నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఐదుమీటర్లకు ఒక చెట్టు పెంచాలని సంకల్పించామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు ఏపీ మంత్రి నారాయణ శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు మే 1వ తేదీ నుంచి కౌలు నిధులు జమ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
ప్రపంచంలోని ఐదు రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో రైతులను అనేక ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు.
టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నారా లోకేశ్‌కు మంత్రులు నారాయణ, అనిత శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకవైపు పార్టీని మరోవైపు తన శాఖను ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తూ లోకేశ్ అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు.