Home » Minister Narayana
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది నిర్వహించే మహానాడును ఈ సారి నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు.
తనపై, ప్రభుత్వంపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండ తీవ్రత నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఐదుమీటర్లకు ఒక చెట్టు పెంచాలని సంకల్పించామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు ఏపీ మంత్రి నారాయణ శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇస్తున్న రైతులకు మే 1వ తేదీ నుంచి కౌలు నిధులు జమ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
ప్రపంచంలోని ఐదు రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో రైతులను అనేక ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు.
టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నారా లోకేశ్‌కు మంత్రులు నారాయణ, అనిత శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకవైపు పార్టీని మరోవైపు తన శాఖను ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తూ లోకేశ్ అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు.
రాజధాని అమరావతి నిర్మాణ పనులపై వైసీపీ ఆరోపణలపై మంత్రి నారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వాయు వేగంతో అమరావతి పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ నెలలోనే పలు భవనాల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడంపై సమావేశంలో చర్చించారు.
అమరావతిలో 250 మీటర్ల ఎత్తుతో ప్రపంచస్థాయి అసెంబ్లీని నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. కేంద్రం, హడ్కో నుంచి నిధుల సమీకరణ పూర్తయిందని మంత్రి వెల్లడించారు.
విశాఖపట్నంలోని గాజువాకలో పర్యటించిన మంత్రి నారాయణ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గాజువాకలో 4.75 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల వసతులతో పార్క్‌ను ప్రారంభించామని మంత్రి చెప్పారు.
అమరావతిలోని ఆయా గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఈ పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.