Home » Minister Nara Lokesh
మత్తు రహిత సమాజమే లక్ష్యంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఉత్తరాంధ్ర కలలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెక్కలు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. విభజన వల్ల చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు పెరగబోతున్నాయన్నారు.
మహిళల్ని అవమానించి, రాక్షస ఆనందం పొందడం వైసీపీ డీఎన్‌ఏలోనే ఉందని మంత్రి లోకేశ్ విమర్శించారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.
మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ జగన్ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మంత్రి లోకేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంటింటికీ కూటమి కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు నాలుగో రోజు రాష్ట్రవ్యాప్తంగా 2.80 లక్షల ఇళ్లకు వెళ్లాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాయి.
స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను మరో సౌదీ అరేబియాగా మార్చాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి లోకేశ్ అన్నారు.
ఆదోని చిన్నారులు సహస్ర ఆద్య, జయ స్కందతో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఫొటో దిగి వారి కోరికను తీర్చారు. ‘లోకేశ్ సర్ మిమ్మల్ని కలవాలి, మీతో ఫొటో దిగాలని ఉంది’ అంటూ ఆదోని చిన్నారుల వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది.
మరో 15 ఏళ్లపాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటే.. నవ్యాంధ్రలో స్వర్ణయుగం సాకారం అవుతుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆ బడికి వెలుగులు ప్రసరించనున్నాయి! విద్యార్థులకు వసతి సమస్య తీరి పక్కాభవనాలు రానున్నాయి. పోలవరం జిల్లా నూతనంగా ఏర్పడిన గుర్తేడు మండలం బొడ్డగండి గ్రామపంచాయతీ పరిధిలోని మెట్టగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలలో 51మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నప్పటికీ, పక్కా భవనం లేక రేకుల షెడ్డులోనే విద్యాభ్యాసం కొనసాగుతోంది.