Home » Minister Anitha
గత జగన్ పాలనలో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా ఏరులై పారేదని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. గంజాయి కేసుల్లో పట్టుబడితే సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నామని ఉద్గాటించారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చుదామని దిశానిర్దేశం చేశారు. విద్యరంగానికి తమ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సాహం అందిస్తోందని హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు.
ఒక వ్యక్తి చనిపోతే వాళ్ల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చాలి. కాని జగన్ చేస్తున్న ఓదార్పు ఏంటో అర్థం కావడం లేదు. వర్క్ ఫ్రమ్ ఓదార్పు యాత్రలా ఆయన పరిస్థితి ఉంది అని హోం మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉందని హోం మంత్రి అనిత ప్రశంసించారు. ఎక్కడ నేరం జరిగినా, ట్రాఫిక్ స్తంభించినా, అసాంఘిక శక్తుల అడ్డాలను టెక్నాలజీ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారని అనిత తెలిపారు.
గంజాయిపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈగల్ టీం ఏర్పాటు చేసి గంజాయి రవాణా, కొనుగోలుని అడ్డుకుంటున్నామని హోంమంత్రి అనిత తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కావాలనే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. జగన్ వాహనం కింద ఓ వ్యక్తి పడిన ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. దయ, జాలి లేకుండా అతడ్ని ముళ్ల పొదల్లో పడేశారని హోంమంత్రి అనిత ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. టెక్నాలజీకి అనుగుణంగా ఆధునీకికరణ పరికరాలు కూడా రైతులకు అందజేస్తున్నామని వివరించారు. నేడు డ్రోన్ ఉపయోగించి, రైతులు వ్యవసాయం చేస్తున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రజలతోపాటు అమరావతి వాసులకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, భారతిరెడ్డి క్షమాపణలు చెప్పాలని హోంమంత్రి వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. విశాఖలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..
అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులు నోరు పారేసుకోవడంపై మహిళా లోకం భగ్గుమంది. రోత చానల్ లైవ్ డిబేట్లో అమరావతి మహిళలపై వారు చేసిన వ్యాఖ్యలపై ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి.
తెనాలిలో పోలీసులపై దాడిచేసిన నేరస్తులకు కులం లేదా మతం ఏ ప్రయోజనమూ లేదని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఈ ఘటనకు రాజకీయ రంగు వేస్తూ బాధితులకు సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి నాదెండ్ల ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు లేవని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తాము పరదాలు కట్టుకుని దాక్కుని వెళ్లడంలేదని చెప్పారు. ప్రజలతో, ప్రజల మధ్య తిరుగుతున్నామని వివరించారు. తెనాలి ఘటనలో కులం, మతం ఎందుకు తెస్తున్నారని అనిత ప్రశ్నించారు.