• Home » Mancherial

Mancherial

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

పోలీసులు క్రమశిక్షణ కలిగి అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం గుడిపేట 13వ బెటాలియన్‌లో జరిగిన పోలీస్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ (దీక్షాంత్‌పరేడ్‌)కు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్‌ ట్రైనీ కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

బాలిక విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే

బాలిక విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే

బాలిక విద్య కోసం కృషి చేసిన తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే అని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఫూలే జయంతిలో డీసీపీ భాస్కర్‌, డీఈవో యాదయ్యతో కలిసి పాల్గొ న్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు.

ప్రజల సంక్షేమానికి కృషి

ప్రజల సంక్షేమానికి కృషి

ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, జిల్లా అటవీ అధికారి శివ్‌ఆశిష్‌సింగ్‌లతో సమావేశం నిర్వ హించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జన్నారం మండలం కవ్వాల్‌ పులుల అభయారణ్యం అభివృద్ధి, వన్య ప్రాణు ల సంరక్షణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల రక్షణకు కృషి చేస్తోం దన్నారు.

యాసంగి సాగుకు కడెం ప్రాజెక్టు సిద్ధం

యాసంగి సాగుకు కడెం ప్రాజెక్టు సిద్ధం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల రైతాంగానికి సాగునీరు అందించే కడెం ప్రాజెక్టు మరమ్మతులు పూర్తయ్యాయి. గత ఏడాది వర్షాకాలంలో భారీగా నీరు చేరడంతో ప్రాజెక్టు ఆనకట్ట దెబ్బతినడంతోపాటు పలు గేట్లు మొరాయించాయి. నీటి లీకేజీ కారణంగా సకాలంలో నీరందక ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ఏజెన్సీ భూముల కబ్జా వాస్తవమే...!

ఏజెన్సీ భూముల కబ్జా వాస్తవమే...!

దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో గిరిజన (ఏజెన్సీ) భూములు కబ్జాకు గురైన విషయం వాస్తవమేనని తేలింది. ఈ మేరకు గురువారం గ్రామంలో సర్వే జరిపిన రెవెన్యూ అధికారులు భూములు కబ్జాకు గురైనట్లు నిర్ధా రించారు. ఏజెన్సీ భూములను స్వాధీనం చేసుకున్న కబ్జా దారులు అందులో రైస్‌మిల్లు కూడా ఏర్పాటు చేశారు.

ఏబీ బర్దన్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలి

ఏబీ బర్దన్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలి

కమ్యూనిస్టు సైద్ధాంతిక తత్వవేత్త ఏబీ బర్దన్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో బర్దన్‌ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా గమ్యస్ధానాలకు చేరుకోవాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురు వారం కలెక్టరేట్‌లో జిల్లా రవాణా శాఖ అధికారి సంతోష్‌కుమార్‌తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల సంబంధిత గోడ ప్రతులను విడుదల చేశారు.

తుది ఓటరు జాబితా ప్రచురణకు సిద్ధం

తుది ఓటరు జాబితా ప్రచురణకు సిద్ధం

ఓటరు జాబితా సవరణలో భాగంగా చేపట్టిన ప్రక్రియ పూర్తి చేసుకుని తుది ఓటరు జాబితా ప్రచురణకు సిద్ధం చేశామని పరిశీలకులు సురేంద్ర మోహన్‌ అన్నారు. గురువారం కలెక్టర్‌ సమావేశ మం దిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్దశుక్లాతో కలిసి సమావేశం నిర్వహించారు.

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

కాల చక్రంలో మరో ఏడాది కనుమరుగైంది. గత యేడాది మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సరానికి ప్రజలు స్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం నుంచే విందులు, సంబరాలు ప్రారంభమయ్యాయి. మద్యం, మాంసం, కేక్‌లు, కూల్‌ కేక్‌లు, రంగవల్లుల, కూల్‌డ్రింక్‌లు, రకరకాల రంగులు విక్రయాలు జోరుగా సాగాయి. ఆయా కూడళ్ళ దగ్గర, స్వీట్‌ హౌజ్‌, ఇతర దుకాణాల వద్ద కేక్‌లు విక్రయించారు. నూతన సంవత్సరం 2025కు స్వాగతం పలుకుతూ మంగళవారం రాత్రి 12 గంటలకు సంబరాలు అంబరాన్నంటాయి.

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినచర్యలు

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినచర్యలు

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకొంటామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు ఇసుక రీచ్‌ల నుంచి తీయడం జరుగుతుందని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని, చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి