Share News

మహిళల ఆర్థికాభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jan 06 , 2025 | 10:44 PM

సామాన్య మహిళలను ఆర్థికాభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ ఆవరణలో ఇందిరా మహిళ శక్తి పథకంలో భాగంగా ముల్కల్ల పంచాయతీలోని వీరాంజనేయ గ్రామ సంఘం రాజరాజేశ్వరి చిన్న సంఘం సభ్యురాలు సుద్దాల విజయ పొందిన సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు.

మహిళల ఆర్థికాభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): సామాన్య మహిళలను ఆర్థికాభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ ఆవరణలో ఇందిరా మహిళ శక్తి పథకంలో భాగంగా ముల్కల్ల పంచాయతీలోని వీరాంజనేయ గ్రామ సంఘం రాజరాజేశ్వరి చిన్న సంఘం సభ్యురాలు సుద్దాల విజయ పొందిన సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ చేపల విక్రయ వాహనంలో తాజా చేపలు అన్ని రకాల రుచికరమైన ఫిష్‌ ఫ్రై లభిస్తాయని తెలిపారు. లబ్ధిదారులకు కేటాయించిన రూ.10 లక్షల ప్రాజెక్టు విలువలో రూ.4లక్షలు సభ్యురాలి వాటాధనం, రూ. 6 లక్షలు ప్రభుత్వ రాయితీ ఉందని తెలిపారు. ఈ వాహనం ద్వారా చేపలు పొందేందుకు 7416639967లో సంప్రదించవచ్చని తెలిపారు. అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, డీఆర్‌డీవో కిషన్‌, ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణ పాల్గొన్నారు.

-జిల్లా ప్రాజెక్టులు రాష్ట్రస్థాయిలో రాణించాలి

రాష్ట్రస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, రాష్ట్ర ఇన్‌స్పైర్‌ అవార్డుల ప్రదర్శనలో జిల్లా ప్రాజెక్టులు ఎంపికకావాలని కలెక్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో జరుగుతున్న ప్రదర్శనలో పాల్గొనేందుకు వెళుతున్న బస్సును అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో 31 మంది విద్యార్థులు గైడ్‌ టీచర్లు మొత్తం 50 మంది ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగే రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొంటారని తెలిపారు. డీఈవో యాదయ్య, జిల్లా సైన్స్‌ అదికారి మధుబాబు, ప్రధానోపాధ్యాఉలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

-తుది ఓటరు జాబితా విడుదల

ఎస్‌ఎస్‌ఆర్‌ 2025లో భాగంగా జిల్లాలోని మూడు శాసనసభ నియోజకవర్గాలకు చెందిన తుది ఓటరు జాబితా విడుదల చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో 96,964 మంది పురుషులు, 99,049 మంది మహిళలు, 7గురు ట్రాన్స్‌జెండర్లు, 8 మంది ఎన్‌ఆర్‌ఐ, 141 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో 88,109 మంది పురుషులు, 90286 మంది మహిళలు, 13 మంది ట్రాన్స్‌జెండర్లు, ఇద్దరు ఎన్‌ఆర్‌ఐ, 179 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో 1,39,306 మంది పురుషులు, 1,42,421 మంది మహిళలు, 26 మంది ట్రాన్స్‌జెండర్లు, 26 మంది ఎన్‌ఆర్‌ఐలు, 364 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని తెలిపారు.

Updated Date - Jan 06 , 2025 | 10:44 PM