Share News

మంచిర్యాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా

ABN , Publish Date - Jan 04 , 2025 | 10:54 PM

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి చేసి మంచిర్యాలను సర్వాంగ సుందరంగా మారుస్తానని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని మహా ప్రస్తాన నిర్మాణ పనులను, మార్కెట్‌ ఏరియాలో రోడ్డు వెడల్పు కార్యక్రమాలను పరిశీలించారు.

మంచిర్యాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా

మంచిర్యాల క్రైం, జనవరి 4(ఆంధ్రజ్యోతి) : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి చేసి మంచిర్యాలను సర్వాంగ సుందరంగా మారుస్తానని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని మహా ప్రస్తాన నిర్మాణ పనులను, మార్కెట్‌ ఏరియాలో రోడ్డు వెడల్పు కార్యక్రమాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని మూడు సంవత్సరాల్లో యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి మాటను నిలబెట్టుకుంటానన్నారు. శివరాత్రి పండుగ లోపు మహాప్రస్తాన నిర్మాణం, మాతా శిశు ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, సెల్లార్‌ తవ్వకాలు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, రాళ్లవాగు ఇరువైపులా కరకట్ట నిర్మాణ పనులు ప్రారంభించడానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యాపారస్థులకు ఇబ్బందులు కలగకుండా పనులు జరిపించాలన్నారు. అండర్‌ గ్రౌండ్‌ పనులను పైలట్‌ ప్రాజెక్టు కింద చేపడతామని అన్నారు. మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారితే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంలో ప్రథమ స్థానంలో నిలుపుతానన్నారు. సింగరేణి కార్మికులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తన ఆరోగ్యంపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారంపై అసహనం వ్యక్తం చేశారు. కమిషనర్‌ మారుతిప్రసాద్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మహేష్‌, మజూద్‌ ఆలీ, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 10:54 PM