Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యం

ABN , Publish Date - Jan 06 , 2025 | 10:47 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా, కొత్త రేషన్‌ కార్డులు అమలు సందర్భంగా ఐబీ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చిత్రపటాలకు సోమవారం క్షీరాభిషేకం నిర్వహించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యం

మంచిర్యాల క్రైం, జనవరి 6 (ఆంద్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా, కొత్త రేషన్‌ కార్డులు అమలు సందర్భంగా ఐబీ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చిత్రపటాలకు సోమవారం క్షీరాభిషేకం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. క్యాబినేట్‌ ఆమోదం తెలపడంతో బాణసంచాలు కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం 24 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతు భరోసాపై బీఆర్‌ఎస్‌, బీజేపీ తప్పుడు ప్రచారాలు చే స్తున్నారని విమర్శించారు. ఎవరైతే వ్యవసాయం చేస్తారో వారికి పెట్టుబడి సాయం కింద అందిస్తామన్నారు. బీడు భూములకు, రాళ్లు, రప్పల భూములకు ఇవ్వడం జరగదన్నారు. పెద్దల జేబులు నింపేందుకే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు కార్యక్రమాన్ని చేపట్టిందని విమర్శించారు. వారి హయాంలో ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. త్వరలో 10 నుంచి 12 లక్షల రేషన్‌ కార్డులను అందజేస్తామని, దీనికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టామన్నారు. ప్రజలను విస్మరించడం వల్లనే బీఆర్‌ఎస్‌ను ప్రజలు తిరస్కరించారన్నారు.

కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు వారి ప్రాణాలను తెగించి క రోనా కాలంలో, ముంపు సమయంలో పార్టీ పిలుపు మేరకు ముందుకు వచ్చి సాయం చేశారని, వారి రుణం తీర్చుకోలేనిదన్నారు. బీజేపీ అంటేనే భారతీయ ఝూటా పార్టీ అని, ఎన్నికల సమయంలో చైనా, పాకిస్తాన్‌, రాముడు, కృష్ణుడు అంటూ ప్రజలను మభ్యపెడుతూ రాజకీయం చేస్తుందన్నారు. అది కేవలం పెట్టుబడిదారి పార్టీ అని విమర్శించారు. ఈ సంద ర్భంగా కొన్ని పత్రికలు ప్రతిపక్షంలో ఉన్నట్టులాగే చూస్తుందని, ఎంత పెద్ద కార్యక్రమం చేసినా తమను గుర్తించడం లేదని, మీడియాను కాదు ప్రజలను నమ్ముకున్నాం, ప్రజలే మాకు అండగా ఉంటారని ప్రింట్‌ మీడియాలో కొందరిని ఆయన విమర్శించారు. మున్సిపల్‌ వైస్‌ చర్మన్‌ మహేష్‌, నాయకులు పూదరి తిరుపతి, చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్‌, మేరుగు బానేష్‌, పెంట రజిత, గజ్జెల హేమలత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 10:47 PM