Home » Mancherial district
క్రీడల ను ప్రతీ ఒక్కరు వారి జీవితంలో భాగం చేసుకో వాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. మూడు రోజు లుగా పట్టణంలోని తిలక్ మైదానంలో నిర్వహిస్తున్న 9వ జాతీయ సాఫ్ట్ బేస్‌బాల్ చాంపియన్ షిప్ పోటీ లు గురువారం ముగిశాయి. విజేతల బహుమతి కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజర య్యారు.
నస్పూర్‌లో కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె గురువారం నాటికి 18వ రోజుకు చేరుకుంది. ఉద్యోగులు శిబిరంలో ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన చేస్తామని జేఏసీ అధ్యక్షురాలు సుమలత, ప్రధాన కార్యదర్శి రాజన్నలు వెల్లడించారు.
నాణ్యమైన ధాన్యం కొను గోలు కేంద్రాలకు తీసుకవచ్చి మద్దతు ధర పొందాలని డీఆర్‌డీఏ డీపీఎం వేణుగోపాల్ సూచించారు. నెల్కివెంకటాపూర్, మదాపూర్, ధర్మరావుపేట, పెద్దపేట, లక్ష్మికాంతపూర్ గ్రామాల్లో గురువారం కేంద్రాలను సందర్శిం చారు.
తెలంగాణ: మంచిర్యాలలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయ్యింది. ఈ సినిమాలో కాసుల కోసం కక్కుర్తిపడిన ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు చనిపోయిన వ్యక్తికి సైతం చికిత్స చేస్తారు. లక్షలు రూపాయల బిల్ వేసి రోగి జేబులు గుల్ల చేయాలని చూస్తారు. అయితే వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యానికి కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి షాక్ ఇస్తారు.
సన్నరకం ధాన్యం పక్కదారి పడుతోంది... ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతోపాటు బోనస్ ప్రకటించినా రైతులు ప్రైవేట్‌కే మొగ్గు చూపుతున్నారు. తేమ శాతంతోపాటు వారు సూచించిన విధంగా బియ్యం గింజ పొడవు, మందం ఉంటేనే సన్నరకంగా పరిగణిస్తున్నారు. రైతులు గ్రామాలకు వచ్చిన వ్యాపారులకే విక్రయిస్తున్నారు. దీంతో రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం అందజేయాలనే ప్రభుత్వం నిర్ణయం ఆచరణ సాధ్యమయ్యేలా అగుపించడం లేదు.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నస్పూర్‌లోని ఎంఎల్‌ఎస్ పాయింట్ ఎదుట రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని గోదాం ఇన్‌చార్జి శంకర్‌కు వినతిపత్రం అందించారు.
దేవాపూర్‌లోని ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్ధానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రభావిత గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని కంపెనీ పర్మినెంటు వర్కర్స్ లోకల్ యూనియన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు.
మండలంలోని నర్సింగాపూర్ గ్రామాన్ని మంచిర్యాల కార్పొరేషన్‌లో విలీనం చేయవద్దని బీజేపీ నాయకులు అన్నారు. మంగళవారం కలెక్టర్ కుమార్ దీపక్‌కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందించారు.
బెల్లంపల్లి పట్టణంలో జాతీయ స్థాయి సాఫ్ట్ బేస్‌బాల్ పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని తిలక్ క్రీడా మైదానంలో 9వ సాఫ్ట్ బేస్‌బాల్ సబ్ జూనియర్ యూత్ అండ్ గర్ల్స్ నేషనల్ చాంపియన్ పోటీలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కంటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారానే తక్కువ ఖర్చుతో గోదావరి జలాలను ఎత్తిపోయవచ్చని ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ పేర్కొంటుంది. అందుకు అనుగుణంగా ఆ ప్రాజెక్టును నిర్మించేందుకు అడుగులు వేస్తోంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించేందుకు సన్నాహాలను ప్రారంభించింది.