కొనసాగుతున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె
ABN , Publish Date - Dec 27 , 2024 | 10:27 PM
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగుతుం దని జేఏసీ అధ్యక్షురాలు సుమలత, ప్రధాన కార్యదర్శి రాజన్నలు తెలిపారు.

నస్పూర్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగుతుం దని జేఏసీ అధ్యక్షురాలు సుమలత, ప్రధాన కార్యదర్శి రాజన్నలు తెలిపారు. మాజీ ప్రధాన మంత్రి, ఆర్థిక వేత్త డాక్టర్ మన్మోహన్‌సింగ్ మృతి చెందడంతో ఉద్యోగులు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు ఆర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెను విరమింపజేయాలి
గర్మిళ్ల, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యో గుల సమ్మెను విరమింపజేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండారపు చక్రపాణి, గుర్రాల రాజవేణులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకో వడం లేదన్నారు. సమ్మె చేస్తున్న కేజీబీవీ ఉపాధ్యాయుల స్ధానంలో ప్రభుత్వ ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపించడాన్ని ఖండిస్తున్నా మన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, డిప్యూటే షన్‌లను రద్దు చేయాలన్నారు.