వాహనదారులు పత్రాలు కలిగి ఉండాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 10:35 PM
వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని సీఐ వేణుచందర్ అన్నారు. శ్రీరాంపూర్‌లోని అరుణక్కనగర్ పోలీసు కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.

శ్రీరాంపూర్, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని సీఐ వేణుచందర్ అన్నారు. శ్రీరాంపూర్‌లోని అరుణక్కనగర్ పోలీసు కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 5 కార్లను సీజ్ చేశారు.
అనంతరం సీఐ మాట్లాడుతూ, నియమ, నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. ఏరియాలో కొత్త వ్యక్తులు కని పిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. శ్రీరాంపూర్, జైపూర్, భీమారం ఎస్‌ఐలు సంతోష్, శ్వేత, శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు.