బకాయిలు చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు
ABN , Publish Date - Dec 27 , 2024 | 10:30 PM
రైసుమిల్లుల యజమానులు ధాన్యం బకా యిలు ప్రభుత్వానికి చెల్లించకుంటే చట్టపర మైన చర్యలు తప్పవని సివిల్ సప్లయి టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ శ్రీధర్‌రెడ్డి పేర్కొ న్నారు. శుక్రవారం ముదిగుంట గ్రామం లోని బీఎస్‌వై రా రైసుమిల్లు, టేకుమట్ల గ్రామంలోని బాలాజీ రైసుమిల్లులను తని ఖీ చేశారు.

జైపూర్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రైసుమిల్లుల యజమానులు ధాన్యం బకా యిలు ప్రభుత్వానికి చెల్లించకుంటే చట్టపర మైన చర్యలు తప్పవని సివిల్ సప్లయి టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ శ్రీధర్‌రెడ్డి పేర్కొ న్నారు. శుక్రవారం ముదిగుంట గ్రామం లోని బీఎస్‌వై రా రైసుమిల్లు, టేకుమట్ల గ్రామంలోని బాలాజీ రైసుమిల్లులను తని ఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ బాలాజీ రైసుమిల్లు నిర్వాహకులు 2023-24 ఖరీఫ్ సీజన్‌లో 2305 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందన్నారు. దీని విలువ రూ.5.5 కోట్లు అని తెలిపారు.
అలాగే బీఎస్‌వై రా రైసుమిల్లు 2022-23 రబీ సీజన్‌లో 3858 మెట్రిక్ టన్నుల ధాన్యం, 2023-24 ఖరీఫ్ సీజన్‌లో 2687 మెట్రిక్‌టన్నుల ధాన్యం ప్రభుత్వానికి చెల్లిం చాల్సి ఉందన్నారు. దీని విలువ సుమారు రూ.19 కోట్లుగా నిర్ధా రించామని తెలిపారు. ఇద్దరు రైసుమిల్లుల నిర్వాహకులతో అంగీ కార పత్రం రాయిం చుకున్నామని, ఈ నెల 31లోగా బకాయిలు చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామని తెలి పామన్నారు. తనిఖీ ల్లో అసిస్టెంట్ సివిల్ సప్లయి అధికారి వేణుగోపాల్, సివిల్ సప్లయి డిప్యూటీ తహ సీల్దార్ స్రవంతి, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సుద ర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.