న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 10:37 PM
న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీసీపీ భాస్కర్ హెచ్చరించారు. శనివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పలువురు రౌడీషీటర్స్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు.

మంచిర్యాల, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీసీపీ భాస్కర్ హెచ్చరించారు. శనివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పలువురు రౌడీషీటర్స్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడకూడదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించ వద్దని సూచించారు. వేడుకలను కుటుంబ సమేతంగా, ఇళ్లలో సంతోషంగా నిర్వహిం చుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్, రాష్, రాంగ్ రూట్ డ్రైవింగ్, దాడులు, బెదిరింపులకు పాల్పడడం, రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాన కూడళ్లలో డ్రంకెన్ డ్రైవ్, ఆక స్మిక తనిఖీలతోపాటు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను బయటకు పంపించి ఇబ్బందులు పడవద్దన్నారు. ఏసీపీ ప్రకాష్, టౌన్ సీఐ ప్రమోదరావు, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ నరేష్ కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.
క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి
జైపూర్, (ఆంధ్రజ్యోతి): పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని ఏసీపీ వెంకటేశ్వర్ పేర్కొ న్నారు. శనివారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసి సిబ్బం దికి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడు తూ సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మెలగాలని సూచించారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు ప్రతీ పోలీసు హెల్మెట్ ధరించాలన్నారు. స్టేషన్‌కు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణను పరిశీలించి పరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిని అభినందించారు. శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, జైపూర్ ఎస్‌ఐ శ్రీధర్ పాల్గొన్నారు.