Home » Mahabubnagar
వైద్య సేవలు అందించడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం అయిందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. రైతుల ఆవేదనను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం… ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కూడా ఫైయిల్ దని ధ్వజమెత్తారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఈర్లపల్లి తండాకు చెందిన రవినాయక్ మృతికి సకాలంలో చికిత్స అందకపోవడమే కారణమని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, విచారణ జరిపించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.
ప్రయాణికుల రద్దీ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి-తిరుపతి (07011) ప్రత్యేక వీక్లీ రైలు సెప్టెంబరు 5 నుంచి 26 వరకూ శుక్రవారాలలో, దీని తిరుగు ప్రయాణపు రైలు (07012) సెప్టెంబరు 6 నుంచి 27 వరకూ శనివారాలలో నడపనున్నట్లు తెలియజేశారు.
యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఓ వ్యక్తి తన మిత్రుని పుట్టిన రోజు సందర్భంగా యూరియా బస్తాను బహుమతిగా ఇచ్చి సంతోషాన్ని నింపాడు.
Officials Caught Drinking: సమాచారం అందిన వెంటనే పోలీసులు ఇరిగేషన్ ఆఫీస్‌కు వెళ్లారు. పోలీసులను చూడగానే అధికారులు అక్కడినుంచి వెళ్లిపోవాలని చూశారు. డోర్నకల్ ఇరిగేషన్ కార్యాలయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-బీదర్ (06519) ప్రత్యేకరైలు ఈ నెల 14న బెంగళూరులో రాత్రి 9-15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం పదకొండున్నరకు బీదర్‌కు చేరుకుంటుందన్నారు.
పాలమూరు బిడ్డనైన తాను పదేండ్ల వరకు సీఎంగా ఉండడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.
నాగర్ కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ పులుల అభయారణ్యం లోని చెంచుపెంటలు, గ్రామాల తరలింపునకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. స్వచ్ఛంద పునరా వాసం కోరుకుంటున్న 1,088 కుటుంబాలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఎన్‌టీసీఏ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) ఆమోదం తెలిపింది.
పాలమూరు నగర ప్రజలను చిరుత పులులు హడలెత్తిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఒకే చిరుత కనిపించగా, ఆదివారం ఒకేసారి రెండు కనిపించడం.. అవి కూడా నివాస గృహాల సమీపంలోకి రావడంతో బెంబేలెత్తిపోతున్నారు.
మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన వరద శనివారం నాటికి క్రమంగా తగ్గుముఖం పట్టింది.