Home » Konda Surekha
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అంశంలో పార్టీ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆమె విషయంలో పార్టీ హైకమాండ్ వద్ద పూర్తి సమాచారం ఉందని అన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మధ్య నెలకొన్న రాజకీయ వివాదం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిందన్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో తాజా రాజకీయ పరిణామాలు ఢిల్లీ వేదికగా ఉత్కంఠను రేపుతున్నాయి. ఈరోజు ఏఐసీసీ అగ్రినేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మంత్రి కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ అత్యంత కఠిన వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది.
మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వానికి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క భార్య వసూళ్లు, మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి దౌర్జన్యాలు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పిటిషన్‌పై రాష్ట్ర హై కోర్టులో సోమవారం విచారణ జరిగింది.