Home » KonaSeema
సంక్రాంతి పర్వదినాల ముసుగులో జూద క్రీడల నిర్వహణకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. సాక్షాత్తూ అధికార తెలుగుదేశం పార్టీ కూటమికి చెందిన ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష ప్రమేయంతో కోనసీమ జిల్లాలో కోడి పందాలు, గుండాటలు, పేకాటలు వంటివి నిర్వహించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సంక్రాంతి వస్తుందంటే హైదరాబాద్ నుంచి కోనసీమకు వచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ సర్వీసులతో పాటు ప్రైవేటు ట్రావెల్స్ పోటీపడి మరీ బస్సులను ఏర్పాటు చేస్తాయి. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీతో పాటు మన ప్రైవేటు ట్రావెల్ బస్సుల టిక్కెట్ ధరలను ఆన్లైన్లో చూసి ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జన్మభూమి కార్యక్రమాన్ని పునఃప్రారంభించనున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ వెల్లడించారు. ఈలోపుగానే రెవెన్యూ సదస్సుల్లో అందిన ఫిర్యాదులను రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా పూర్తి నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్లోని గోదావరి భవన్లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 6 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య పెన్షన్ల తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. నెలకు రూ.15వేలు పెన్షన్ పొందుతూ మంచానికి, వీల్చైర్లకు పరిమితమైన 373 మంది పెన్షన్‌దారులు మస్క్యులర్ డిస్ర్టోపి, యాక్సిడెంట్ ప్రభావిత వ్యక్తులకు జిల్లాలో 120 మందికి పెన్షన్లు అందుతున్నాయన్నారు. మొత్తంగా 493 మంది అర్హతను ఈ ప్రక్రియలో వైద్య నిపుణులతో కూడిన బృందాలు పరిశీలించనున్నాయని చెప్పారు.
పాఠశాల యాజమాన్య కమిటీలకు శిక్షణలో భాగంగా జిల్లావ్యాప్తంగా 18,799 మంది కమిటీ సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నట్టు సమగ్ర శిక్ష సీఎంవో చామంతి నాగేశ్వర్రావు చెప్పారు. శుక్రవారం ఆయన తొండంగిలో జరుగుతున్న రిసోర్స్‌ప ర్సన్ల శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. హాజరైన ప్రధానోపాధ్యాయులు, విద్యాకమిటీ చైర్మన్లను ఉద్దేశించి మా ట్లాడారు.
జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరైన రోడ్ల పనులు వెంటనే మొదలు పెట్టి సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ షాన్ మోహన్ షగిలి అధికారులను ఆదేశించారు. ప్రత్తిపాడు మండలంలోని ప్రత్తిపాడు, వేములపాలెం, పెద్దిపాలెం, ఉత్తరకంచి గ్రామాల్లో గురువారం కలెక్టర్ పర్యటించారు. వేములపాలెం, ఉత్తరకంచి, పెద్దిపాలెంలలో రోడ్ల పరిస్థితిని పరిశీలించారు.
ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగే శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కల్యాణోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ చెప్పారు. అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలోని కల్యాణ షెడ్డులో ఉత్సవాల సమీక్షా సమావేశాన్ని అమలాపురం ఆర్డీవో కె.మాధవి అధ్యక్షతన గురువారం నిర్వహించారు.
ఈ నెల 7 నుంచి కోనసీమ క్రీడోత్సవం పేరిట నిర్వహిస్తున్న క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఉన్న రైతు బజార్‌ను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి వెల్లడించారు. రైతు బజార్ ప్రాంగణంలో శనివారం రైతులతో అవగాహన సదస్సును నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన రైతులతో పాటు ఉద్యాన, మార్కెటింగ్, మత్స్యశాఖల అధికారులు సదస్సులో పాల్గొన్నారు.