2 వరకు కుష్టు వ్యాధి బాధితుల గుర్తింపు ప్రక్రియ
ABN , Publish Date - Jan 21 , 2025 | 12:12 AM
జిల్లాలో ఫిబ్రవరి 2 వరకు కుష్టు బాధితులను గుర్తించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనా కార్యక్రమంలో ఈ నెల 20 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనా కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
అమలాపురం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఫిబ్రవరి 2 వరకు కుష్టు బాధితులను గుర్తించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనా కార్యక్రమంలో ఈ నెల 20 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనా కార్యక్రమం వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. చర్మంపై స్పర్శలేని మచ్చలు, మందమైన మెరిసే జిడ్డు గల చర్మం, వీపుపై నొప్పిలేని బొడిపెలు వంటివి ఉన్నవారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఉపశమనం పొందవచ్చునన్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారు మీ ఇళ్ల వద్దకు వచ్చే ఆరోగ్య కార్యకర్తలు ద్వారా పరీక్షలు చేయించుకోవచ్చునన్నారు. ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోను ఉచితంగా మందులు అందిస్తామని చెప్పారు. అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్ సీహెచ్‌వీ భరతలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.