తువ్వ మట్టి లారీ సీజ్
ABN , Publish Date - Jan 21 , 2025 | 11:59 PM
గంటిపెదపూడి వద్ద అను మతులు లేకుండా తువ్వ మట్టిని తరలిస్తున్న లారీని సీజ్ చేసినట్లు తహ శీల్దార్ పి.శ్రీపల్లవి తెలిపారు. మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన తువ్వమట్టినీ వదల్లేదు! వార్తకు స్పందించిన అఽధికారులు తనిఖీలు నిర్వహించారు.
పి.గన్నవరం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): గంటిపెదపూడి వద్ద అను మతులు లేకుండా తువ్వ మట్టిని తరలిస్తున్న లారీని సీజ్ చేసినట్లు తహ శీల్దార్ పి.శ్రీపల్లవి తెలిపారు. మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన తువ్వమట్టినీ వదల్లేదు! వార్తకు స్పందించిన అఽధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉడిమూడి నుంచి అనధికార ర్యాంపు నుంచి వస్తున్న తువ్వ మట్టి లారీని గంటిపెదపూడి ఏటిగట్టుపై స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఆర్‌ఐ వర్మ, వీఆర్వో దుర్గాప్రసాద్ ఉన్నారు.