• Home » KonaSeema

KonaSeema

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా అడబాల

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా అడబాల

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అడబాల సత్యనారాయణ ఎన్నికయ్యారు. మలికిపురం మండలం తూర్పు పాలెం గ్రామానికి చెందిన ఆయన 1994లో బీజేపీలో చేరారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో అనేక పదవులు నిర్వర్తించారు.

 గణతంత్ర వేడుకల విజయవంతానికి సన్నద్ధం కావాలి

గణతంత్ర వేడుకల విజయవంతానికి సన్నద్ధం కావాలి

76వ గణతంత్ర వేడుకలను అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ నెల 26న ఘనంగా నిర్వహించేందుకు సర్వసన్నద్ధం కావాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి అధికారులను ఆదేశించారు. ప్రతీ ప్రభుత్వ శాఖలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించే విధంగా జిల్లాస్థాయి అధికారులు జాబితాలను సిద్ధం చేయాలన్నారు.

రేపటి నుంచి కోనసీమ క్రీడోత్సవాలు

రేపటి నుంచి కోనసీమ క్రీడోత్సవాలు

కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ప్రత్యేక చొరవతో కోనసీమ క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ షేక్‌ సలీంబాషా తెలిపారు. కోనసీమ క్రీడోత్సవాల్లో భాగంగా జిల్లాలోని 22 మండలాల పరిధిలోని 2600 మంది పాఠశాలల విద్యార్థులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారన్నారు.

అర్జీల పరిష్కారంలో బాధ్యతారాహిత్యం తగదు

అర్జీల పరిష్కారంలో బాధ్యతారాహిత్యం తగదు

అర్జీల పరిష్కారంలో బాధ్యతా రాహిత్యానికి తావు లేకుండా ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ సూచించారు. పరిష్కార సరళిపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సోమవారం జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు.

 2 వరకు కుష్టు వ్యాధి బాధితుల గుర్తింపు ప్రక్రియ

2 వరకు కుష్టు వ్యాధి బాధితుల గుర్తింపు ప్రక్రియ

జిల్లాలో ఫిబ్రవరి 2 వరకు కుష్టు బాధితులను గుర్తించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనా కార్యక్రమంలో ఈ నెల 20 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించారన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనా కార్యక్రమం వాల్‌ పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.

చెత్త రీసైక్లింగ్‌కు భూసేకరణ చేపట్టాలి

చెత్త రీసైక్లింగ్‌కు భూసేకరణ చేపట్టాలి

అమలాపురం పట్టణ పరిసర గ్రామాల్లోని ఘన, ద్రవ పదార్థాల వ్యర్థాలను డంపింగ్‌ యార్డుకు తరలించి రీసైక్లింగ్‌ చేసేందుకు వీలుగా అవసరమైన భూ సేకరణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

ఫిబ్రవరి 4 నుంచి అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు

ఫిబ్రవరి 4 నుంచి అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు

అమలాపురం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వ సన్నద్ధం కావాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లాస్థాయి అధికారులతో కల్యాణోత్సవాల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 4 నుంచి 13వ తేదీ వరకు కల్యా

ఊరు సమస్యపై పండగ రోజు గ్రామస్తుల వినూత్న నిరసన..

ఊరు సమస్యపై పండగ రోజు గ్రామస్తుల వినూత్న నిరసన..

పండగంటే ఊరంతా సందడి వాతావరణం. పండుగ శుభాకాంక్షల ఫ్లెక్సీలతో గ్రామమంతా నిండిపోతుంది. కానీ అక్కడి గ్రామ ప్రజలు మాత్రం ఈ పండుగకు ఊరి సమస్యను అందరికీ తెలిసేలా ఫ్లెక్సీ ఏర్పాటుచేసి.. తమ సమస్యకు పరిష్కారం కావాలంటూ గళమెత్తారు.

Konaseema: నరాలు తెగే ఉత్కంఠ రేపిన డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్‌ పోరు..

Konaseema: నరాలు తెగే ఉత్కంఠ రేపిన డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్‌ పోరు..

ఆత్రేయపురం వద్ద గోదావరి ప్రధాన కాలువలో మూడ్రోజులుగా వాటర్ స్పోర్ట్స్ ఉత్సాహంగా సాగుతున్నాయి. మెుత్తం 11 జిల్లాలకు చెందిన 180 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దగ్గరుండి మరీ పడవ పోటీలను నిర్వహించారు.

ఆదమరిచి నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి దొంగలు పడ్డారు

ఆదమరిచి నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి దొంగలు పడ్డారు

అమలాపురం టౌన్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి వరకు టీవీ చూసి ఇంట్లో ఆదమరిచి నిద్రిస్తుండగా దొంగలు పడి రూ.10.50లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకుపోయారు. సమాచారం తెలుసుకున్న అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్కే ప్రసాద్‌, పట్టణ సీఐ పి.వీరబాబు సిబ్బందితో సంఘటనా

తాజా వార్తలు

మరిన్ని చదవండి