Home » KCR
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎ్‌సను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతోందని, తాను పార్టీలో ఉన్నంతకాలం అది కుదరదన్న ఉద్దేశంతో తనను కేసీఆర్‌కు దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఎంపీ ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ స్టేట్ ఫైట్ తప్పా.. స్ట్రీట్ ఫైట్ చేయదని స్పష్టం చేశారు. నీచ రాజకీయాల తాము చేయబోమని తేల్చిచెప్పారు ఈటల రాజేందర్.
కవిత బీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతూ కాంగ్రెస్ అధిష్ఠానంతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె చేరికకు ‘నో’ అని చెప్పినా, కవిత స్వతంత్రంగా సొంత అడుగులు వేస్తోంది.
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు మాజీ సీఎం కేసీఆర్ జూన్ 5న నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హరీశ్, కేటీఆర్‌తో చర్చలు జరిపారు; సమాచార సేకరణ కొనసాగుతోంది.
బీఆర్ఎస్లో అంతర్గత పోరు తారా స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ బయటకు రావడంతో మొదలైన ఈ పొలిటికల్ సైక్లోన్.. మరింత తీవ్రంగా మారేలా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత.. తన తండ్రి పార్టీని కాదని..
Madan Lal Passes Away: వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ గుండెపోటుతో కన్నుమూశారు. మాజీ ఎమ్మెల్యే మృతిపట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ జూన్ 6న హాజరు కానున్నారు. విచారణ కమిషన్ జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇవ్వనున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు.. ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ వ్యవహారం, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్న ఆమె వ్యాఖ్యలు ఆ పార్టీలో రోజురోజుకూ మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి.
బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతుండగా.. ఈ అంశంపై పార్టీ నేతలెవరూ స్పందించవద్దని అధినేత కేసీఆర్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సూచించినట్లు తెలిసింది.
KTR: ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలవనున్నారు. బీఆర్ఎస్‌లో తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించనున్నారు. కవిత కొత్త పార్టీ పెట్టనున్నారనే ప్రచారం నేపథ్యంలో కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.