Share News

CM Revanth Reddy: కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా

ABN , Publish Date - Jul 03 , 2025 | 09:27 PM

మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కె.చంద్రశేఖర్ రావు ఆరోగ్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ అనారోగ్యానికి గురి కావడం.. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడంతోపాటు ఆయనకు అందిస్తున్న చికిత్సకు సంబంధించిన వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

CM Revanth Reddy: కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా
TG CM Revanth Reddy and Ex CM KCR

హైదరాబాద్, జులై 03: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కె. చంద్రశేఖర్ రావు ఆరోగ్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ అనారోగ్యానికి గురికావడం.. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేరడంతోపాటు ఆయనకు అందిస్తున్న చికిత్సకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌కు మెరుగైన చికిత్స అందించాలని ఈ సందర్భంగా వైద్యులు, ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని.. మంచి ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.


కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో మాజీ సీఎం కేసీఆర్ బాధపడుతున్నారు. దీంతో ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి గురువారం నాడు నందినగర్‌లోని తన నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయనకు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.


దీంతో ఆయన్ను ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచించారు. వారి సూచనలకు అనుగుణంగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో కేసీఆర్ చేరారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ ఆసుపత్రిలో చేరిన సమయంలో ఆయన వెంటే మేనల్లుళ్లు హరీశ్ రావు, సంతోష్ రావులు ఉన్నారు. మరోవైపు కేసీఆర్ ఆసుపత్రిలో చేరడంతో.. సోమాజిగూడకు భారీఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. కాగా, యశోద ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఇక కేసీఆర్ ఆరోగ్యంపై యశోద ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కేసీఆర్.. నిరసంతో ఆసుపత్రిలో చేరారని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కేసీఆర్‌కు చికిత్స కొనసాగుతుందని యశోద ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు.


null

ఇవి కూడా చదవండి

రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..

తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్

టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 03 , 2025 | 10:13 PM