Home » Karnataka
ఈ ఏడాది మైసూరు దసరా ఉత్సవాల ప్రారంభానికి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత బాను ముస్తాక్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో వివాదం తలెత్తింది. ఆమె గతంలో హిందూ వ్యతిరేక, కన్నడ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని బీజేపీ అభ్యంతరం పెట్టింది
హాసన్ జిల్లా హొళెనరసీపుర తాలూకా దొడ్డకాడనూరు గ్రామానికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు. హిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. ఆమెకు ఒక మగ శిశువు, ఇద్దరు ఆడ శిశువులు జన్మించారని హిమ్స్ ఆసుపత్రి స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ న్యాన్సీ పాల్ తెలిపారు.
ఆ వ్యక్తిని అందరూ ఆయిల్ కుమార్ అని పిలుస్తారు. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఆ వ్యక్తి విచిత్రమైన ఆహారపు అలవాట్లతో అందరికీ షాకిస్తున్నాడు.. గత ముప్పై ఏళ్లుగా అతడు ఆహారం తీసుకోవడం లేదు.. కనీసం మంచినీళ్లు కూడా తాగడం లేదు..
ఈ వీడియో గురించి పవన్‌కు తెలిసింది. వీడియోను డిలీట్ చేయించడానికి చాలా ప్రయత్నించాడు. అయితే, అతడి ప్రయత్నాలు ఫలించలేదు. వీడియో కారణంగా కాలేజీతో పాటు ఊర్లోనూ తన పరువుపోయిందని పవన్ భావించాడు.
బెంగళూరు టీడీపీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడిగా దశాబ్దకాలానికి పైగా వ్యవహరించిన కనకమేడల వీరాంజనేయులు అలియాస్ వీరాను తిరుమల తిరుపతి దేవస్థానం బెంగళూరు కమిటీ చైర్మన్‌గా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొత్త కమిటీలను నియమించే విషయంలో వాయిదాలు పడుతూ వచ్చింది.
ప్రధానమంత్రిగా ప్రస్తుతం నరేంద్రమోదీ ఉన్నారని భవిష్యత్తులో యోగీ ఆదిత్యనాథ్ వస్తారని అప్పుడు మరింత కఠిన నిర్ణయాలు తప్పవని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ వెల్లడించారు.
సినిమాల్లో బ్యాంకుల్లోకి వెళ్లి అక్కడి సిబ్బందికి తుపాకీ అడ్డు పెట్టి దోపిడీలు చేయడం చూస్తుంటాం. ఇప్పుడు అచ్చం అలాంటి ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నంజేగౌడ గెలుపును బీజేపీ అభ్యర్థి కేఎస్ మంజునాధ్ గౌడ హైకోర్టులో సవాలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, ఫలితాన్ని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు.
రాజకీయాలనుంచి రిటైర్డు అయ్యేది లేదని, ప్రస్తుతం 93ఏళ్లు అని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అయినా వీల్ చైర్లోనే పార్లమెంటుకు వెళ్తానని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. హాసన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెన్నై - బెంగళూరు నేషనల్ ఎక్స్‌ప్రెస్ వే, బెంగళూరు - హైదరాబాద్ హైవేల ప్రాధాన్యత ప్రధానమంత్రికి వివరించానని, వచ్చే బడ్జెట్లో ఎక్కువ గ్రాంట్లు రానున్నాయన్నారు.
రాజకీయాలలోకి వారసులు రావడం కొత్తేమి కాదు. అయితే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడే సీఎం సిద్దరామయ్య మరో వారసుడు రాజకీయాలలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చలు జోరందుకున్నాయి.