Share News

Indias First Zombie: పిచ్చి పీక్స్.. ఇండియాలో మొదటి జాంబీ మ్యాన్ ఇతనే..

ABN , Publish Date - Nov 17 , 2025 | 08:05 AM

మంజునాథ్ జాంబీలా కనిపించటం కోసం చాలా సర్జరీలు చేయించుకున్నాడు. నాలుకను సైతం రెండుగా కోయించుకున్నాడు. చెవులను కత్తిరించుకున్నాడు. తలకు కొమ్ములు కూడా తగిలించుకున్నాడు.

Indias First Zombie: పిచ్చి పీక్స్.. ఇండియాలో మొదటి జాంబీ మ్యాన్ ఇతనే..
Indias First Zombie

సాధారణంగా ఈ భూమ్మీద పుట్టిన మనుషులందరికీ ఓ కోరిక బలంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తికి అందంగా కనిపించాలి అనుకుంటారు. ఆడ కావచ్చు, మగ కావచ్చు అందంగా కనిపించడానికి ప్లాస్టిక్ సర్జీలు సైతం చేయించుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. కొంతమంది మాత్రం భయంకరంగా కనిపించడానికి సర్జరీలు చేయించుకుంటున్నారు. లక్షలు, కోట్లు ఖర్చుపెట్టి రాక్షసుడిలా కనిపించడానికి సర్జరీలు చేయించుకున్న ఘటనలు విదేశాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. ఇండియాలో మొదటి సారి మంజునాథ్ పూజారీ అనే యువకుడు జాంబీ అవతారం ఎత్తాడు.


కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంజునాథ్ జాంబీలా కనిపించటం కోసం చాలా సర్జరీలు చేయించుకున్నాడు. నాలుకను సైతం రెండుగా కోయించుకున్నాడు. చెవులను కత్తిరించుకున్నాడు. తలకు కొమ్ములు కూడా తగిలించుకున్నాడు. ఒళ్లంతా ట్యాటూలు వేయించుకున్నాడు. ఇదంతా ఒకే సారి జరగలేదు. ఏళ్ల పాటు తనను తాను చాలా కష్టపెట్టుకున్నాడు. ప్రమాదకరమైన సర్జరీలు చేయించుకున్నాడు. ఎంతో నొప్పిని భరించాడు. అంతేకాదు.. జాంబీలా మారటం కోసం ఏకంగా 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. తనను తాను జాంబీ మ్యాన్‌గా ప్రకటించుకున్నాడు.


ఇక, ఇండియన్ జాంబీ మ్యాన్ మంజునాథ్ పూజారీ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. వాటిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇప్పటి వరకు విదేశాల్లో మాత్రమే ఇలాంటి వారు ఉండేవారు. ఇప్పుడు ఇండియాలో కూడా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది’..‘పిచ్చి పలు రకాలు.. ప్రాణం పోతుందని తెలిసినా సర్జరీలు చేయించుకోవటం ఎంత వరకు కరెక్ట్’..‘అంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

మెక్సికోలో జెన్-జెడ్ నిరసనలు.. హింసాత్మక దాడుల్లో 120 మందికి గాయాలు..

బావుమాకు సారీ చెప్పిన బుమ్రా!

Updated Date - Nov 17 , 2025 | 08:44 AM