Home » Iran War
ఇరాన్ రాజధాని టెహ్రాన్ తూర్పు ప్రాంతంలో శనివారం భారీ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పాక్‌దష్త్, ఖియామ్‌దష్త్ ప్రాంతాల ప్రజలు ఈ పేలుడు శబ్దాలను విని దాడులు జరుగుతున్నట్టు భయపడ్డారు.
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. తనపై హత్యాయత్నం చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే, ఆ దేశంపై క్షిపణుల వర్షం తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్‌ను అమెరికా హెచ్చరించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం, కాల్పుల విరమణ కూడా ముగిసిపోయిందని ఆయన స్పష్టం చేశారు.
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న ఇరాన్‌ను దెబ్బతీసేందుకే తాము దాడులు చేస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని, మే నెల నుంచి హోర్ముజ్ తమ నియంత్రణలోనే ఉందని తెలిపింది.
నిన్న (గురువారం) అమెరికా, ఇరాన్‌లు పరస్పరం దాడులు చేసుకున్నాయి. గురువారం తెల్లవారుజామున ఇరాన్‌లోని అణు విద్యుత్ కేంద్రం బుషెహర్ ప్లాంట్‌పై అమెరికా మిస్సైల్ దాడులు చేసింది. దీంతో అణు ప్లాంట్ ఆవరణలోని ఓ భవనం దెబ్బతింది.
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇవాళ ఆయన స్వస్థలమైన మష్హద్‌లో ముగిశాయి. ఇరాన్, ఇరాక్ దేశాల్లో గత ఆరు రోజులుగా సాగుతున్న సుదీర్ఘ అంతిమయాత్ర ఈ సాయంత్రం జరిగిన ఖననంతో ముగిసింది.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నివాసం ధ్వంసమైన దృశ్యాలను తొలిసారిగా ఆ దేశ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఈ వీడియోను బయటపెట్టింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.