ఇరాన్ అధ్యక్ష బృందం పర్యటన.. కొందరికి యూఎస్ వీసా నిరాకణ
ABN , Publish Date - Sep 21 , 2026 | 07:37 PM
ఇరాన్ అధ్యక్ష బృందంలోని కొందరికి వీసాలను అమెరికా నిరాకరించింది. ఈ మేరకు ఇరాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్ష బృందం అమెరికాకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే, బృందంలోని కొందరు సభ్యులకు వీసాలను అమెరికా నిరాకరించింది. ఈ మేరకు ఇరాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అధ్యక్ష బృందంలోని కమ్యూనికేషన్స్ బృందానికి వీసాలను అమెరికా నిరాకరించింది. ఈ చర్యపై సహజంగానే ఇరాన్‌లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పాటు విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ కూడా యూఎస్‌కు వెళ్లనున్నారు. ఆదివారమే బయలుదేరిన అరాగ్జీ ఖతర్‌లో దిగారు. అక్కడి నుంచి అమెరికాకు వెళతారు.
మరోవైపు, ఇరాన్ బృందంపై ఇప్పటికే అమెరికా పలు ఆంక్షలు విధించింది. అమెరికాలో ఇరాన్ బృందం కదలికలపై పరిమితులు విధించడంతో పాటు అక్కడి విలాసవంతమైన వస్తువులేమీ కొనకూడదని స్పష్టం చేసింది. ఇక హోర్ముజ్ జలసంధిని తెరవడంపై ఇప్పటికే తన షరతులను మధ్యవర్తి ద్వారా అమెరికాకు చేరవేశామని ఇరాన్ తెలిపింది. గతంలో శాంతిస్థాపన కోసం కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు అమెరికా తన హామీలను నిలబెట్టుకోవాలని స్పష్టం చేసింది. అప్పటివరకూ హోర్ముజ్ మూసే ఉంటుందని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొమహ్మద్ బాఘెర్ గాలిబఫ్ తేల్చి చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
6 అడుగుల రోబోతో ఫైట్.. కడుపులో ఒక్క కిక్ ఇవ్వడంతో..
కదులుతున్న విమానంలో నిలబడ్డ ప్రయాణికులు.. వీడియో వైరల్