6 అడుగుల రోబోతో ఫైట్.. కడుపులో ఒక్క కిక్ ఇవ్వడంతో..
ABN , Publish Date - Sep 21 , 2026 | 06:40 PM
ప్రపంచంపై రోబోలు, ఏఐ సాంకేతికతలు పట్టుబిగిస్తాయన్న భయాలు నెలకొన్న కాలం ఇది. ఈ నేపథ్యంలో రోబో ఫైట్ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంపై రోబోలు, ఏఐ సాంకేతికతలు పట్టుబిగిస్తాయన్న భయాలు నెలకొన్న కాలం ఇది. ఈ నేపథ్యంలో రోబో ఫైట్ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆరడుగుల రోబోతో మనిషి తలపడ్డ వీడియో ఇది. జనాలు ఈ వీడియో చూసి షాకైపోతున్నారు. ముఖ్యంగా రోబో దెబ్బకు ఎదురుగా ఉన్న మనిషి అంతదూరానికి ఎగిరిపడ్డ వైనం జనాలను షాక్‌కు గురిచేస్తోంది. యూఎస్‌కు చెందిన రోబోటిక్స్ సంస్థ ఆర్‌ఈకే శాన్‌ఫ్రాన్‌సిస్కోలో ఈ ఫైట్‌ను ఏర్పాటు చేసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ ఫ్రాంకీ లాపెన్నీ ఈ రోబోతో తలపడ్డాడు.
అసలైన్ ఫైటర్‌ను తలపించేలా రోబోను ఆ సంస్థ డిజైన్ చేసింది. గాల్లోకి కిక్కులు, పంచ్‌లను విసురుతూ ఆ రోబో రింగ్‌లోకి అడుగుపెట్టింది. తరువాత ఫ్రాంకీతో తలపడింది. అచ్చు సాధారణ ఫైటర్‌లాగానే ఫ్రాంకీపై పంచ్‌లు విసిరింది. అతడి దాడిని తప్పుకునే ప్రయత్నం చేసింది. ఫ్రాంకీ కూడా మొదట రోబో దెబ్బలను తప్పించుకుంటూ ఎదురుదాడికి దిగాడు. దీంతో, రోబో కాస్త తడబడ్డట్టు కనిపించింది. ఇంతలోనే ఫైట్ ఊహించని మలుపు తిరిగింది. రోబో ఒక్కసారిగా ఫ్రాంకీకి కడుపులో కిక్ ఇవ్వడంతో అతడు అంతదూరానికి ఎగిరిపడ్డాడు.
భవిష్యత్తును కళ్లముందు నిలిపినట్టు ఉన్న ఈ వీడియోపై జనాలు రకరకాల కామెంట్స్ చేశారు. చివరకు భవిష్యత్తులో అన్నీ ఇలాంటి ఫైట్సే చూస్తామా? అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. ‘అసలైన ఫైటర్ ఈ రోబోతో తలపడి ఉంటే ఎలా ఉండేదో? ప్రొఫెషనల్ రెజర్లు అయితే ఇంకా మెరుగైన ప్రదర్శన ఇచ్చి ఉండేవారేమో?’ అని మరో వ్యక్తి కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఈ వార్తలనూ చదవండి:
కదులుతున్న విమానంలో నిలబడ్డ ప్రయాణికులు.. వీడియో వైరల్
ఆఫీస్‌లో సెక్యూరిటీ భయ్యానే నా తొలి స్నేహితుడు.. యువతి వీడియో వైరల్