త్వరలో యూఎస్‌కు ఇరాన్ అధ్యక్షుడు.. వీసా మంజూరు!
ABN , Publish Date - Sep 20 , 2026 | 05:13 PM
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మరికొన్ని రోజుల్లో అమెరికాకు వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి ఇరాన్ మీడియా సంస్థ తస్నీమ్ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మరికొన్ని రోజుల్లో అమెరికాకు వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి ఇరాన్ మీడియా సంస్థ తస్నీమ్ ఓ కథనాన్ని ప్రచురించింది. న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన వెళ్లనున్నట్టు వెల్లడించింది. అధ్యక్షుడితో పాటు, విదేశాంగ శాఖ మంత్రి అరాగ్చీ, వారి బృందంలోని ఇతర సభ్యులందరికీ ఇప్పటికే వీసాలు కూడా మంజూరు అయినట్టు వెల్లడించింది. సెప్టెంబర్ 22 - 29 మధ్య ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరగనున్నాయి.
యూఎస్ వీసాలు మంజూరు అయినప్పటికీ ఇరాన్ బృందంపై పలు ఆంక్షలు ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అమెరికాలో పర్యటనలపై పరిమితులు, విలాసవంతమైన వస్తువుల కొనుగోళ్లపై ఆంక్షలు విధించినట్టు సమాచారం. ప్రస్తుతం ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మరోవైపు, ఇరాన్ విషయంలో ఐక్యరాజ్య సమితిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌పై ఆంక్షల విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనను ఇప్పటికే రష్యా, చైనాలు వీటో చేశాయి.
ఈ వార్తలనూ చదవండి:
పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యం ముగిసింది: ఇరాన్ స్పీకర్
ఏఐకి కొత్త పేరు పెట్టండి.. ప్రజలకు ట్రంప్ పోలింగ్