Home » India Vs Bangladesh
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో 67 పరుగులు చేస్తే వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించనున్నాడు. గిల్ తన తర్వాతి 3 ఇన్నింగ్స్‌లో 67 పరుగులు సాధిస్తే వన్డేల్లో వేగంగా 2 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచరికార్డు నెలకొల్పుతాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో చరిత్రాత్మక రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 77 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 26 వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 25,923 పరుగులు ఉన్నాయి.
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా నాలుగో విజయంపై కన్నేసింది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న భారత్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇదే ఊపులో గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ సత్తా చాటాలని రోహిత్ సేన భావిస్తోంది.
సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న భారత్ మరో పోరుకు సిద్ధమవుతోంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే మ్యాచ్ వేదికైన పుణే చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత రెండు ప్రపంచకప్‌లలో బంగ్లాదేశ్‌పై వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. దీంతో మూడో ప్రపంచకప్‌లోనూ బంగ్లాదేశ్‌పై సెంచరీ సాధించి హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు.
సూపర్-4లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు తడబడ్డారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 265 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకుంది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించారు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ప్రపంచకప్‌నకు ముందు తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకునేందుకు, అలాగే అందరికీ సరైన ప్రాక్టీస్ లభించేందుకు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వొచ్చు.
టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ మంచి క్రీడాకారిణి అన్న మిథాలీ.. ఆమె యువ క్రీడాకారిణులకు రోల్ మోడల్ అన్నారు. కనుక వారంతా హర్మన్‌ప్రీత్ కౌర్‌ను అనుసరించాలని అనుకుంటారని, కాబటి మైదానంలో, మైదానం వెలుపల హర్మన్ ప్రీత్ కౌర్ గౌరవప్రదంగా నడుచుకోవాలని మిథాలీ సూచించారు.
టీమిండియా ఉమెన్స్ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెకు 4 డిమెరిట్ పాయింట్లు కేటాయించే అవకాశాలున్నాయి. దీంతోపాటు మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించొచ్చు. మ్యాచ్ ఫీజ్ సంగతి పక్కనపెడితే డీమెరిట్ పాయింట్లు కనుక కేటాయిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలున్నాయి.