Asia Cup 2023: హాఫ్ సెంచరీలతో చెలరేగిన షకీబ్, తౌహీద్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

ABN , First Publish Date - 2023-09-15T19:09:55+05:30 IST

సూపర్-4లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు తడబడ్డారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 265 పరుగులు చేసింది.

Asia Cup 2023: హాఫ్ సెంచరీలతో చెలరేగిన షకీబ్, తౌహీద్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు తడబడ్డారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 8 వికెట్లు నష్టపోయి 265 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ షకీబుల్ హసన్ గొప్పగా పోరాటం చేశాడు. 85 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేసి బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి తౌహీద్ హృదోయ్, నసుమ్ అహ్మద్ తమ వంతు సహకారం అందించారు.

ఇది కూడా చదవండి: Team india: ఫిట్‌నెస్‌లో సన్‌రైజర్స్ ఆటగాడే టాప్.. కోహ్లీ, గిల్‌ను మించిపోయాడుగా..!!

తౌహీద్ హృదోయ్ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 81 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. నసుమ్ అహ్మద్ 45 బాల్స్‌లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 44 పరుగులు చేశాడు. దీంతో బంగ్లాదేశ్‌ను ఆలౌట్ ప్రమాదం నుంచి తప్పించారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు సాధించగా.. షమీ 2 వికెట్లు పడగొట్టాడు. జడేజా, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలో వికెట్ సాధించారు. తిలక్ వర్మ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 21 పరుగులు ఇచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ సాధించడంతో అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా తరఫున రవీంద్ర జడేజా 200 వికెట్ల మార్కును చేరుకున్నాడు.


అటు ఇప్పటికే టీమిండియా ఫైనల్‌కు వెళ్లడంతో నామమాత్రంగా నిలిచిన ఈ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌లకు విశ్రాంతి ఇచ్చి వారి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణలను తీసుకున్నట్లు కెప్టెన్ రోహిత్ తెలిపాడు.

Updated Date - 2023-09-15T19:20:22+05:30 IST