Home » IMD
బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం నాడు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవన స్తంభించింది. బస్సు, రైలు, విమాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారతీయ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో ఈ నెల 19వ తేది వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమ మధ్య, దానిని అనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తోండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు ఆరోగ్యశాఖకు మంత్రి దామోదర రాజనర్సింహ కీలక సూచనలు చేశారు. వర్షాల్లో వైద్య సేవలు నిరవధికంగా కొనసాగించాలని ఆదేశించారు. గర్భిణుల కోసం అత్యవసర చికిత్సకూ సిద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సచివాలయంలో రెవెన్యూశాఖ అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు కాలనీల్లో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్రిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఈ విషయమై వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.