Home » IMD
తెలంగాణ - రాయలసీమ - తమిళనాడు మీదుగా ద్రోణి ప్రభావ కొనసాగుతోందని ఏపీ వాతావరణ, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు అలర్ట్ జారీ చేశారు.
ఎల్‌నినో ప్రభావంతో హైదరాబాద్ నగరంలో సెప్టెంబరు నాటికీ లోటు వర్షపాతం నమోదైంది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వానల నేపథ్యంలో ఆయా జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
నైరుతి రుతుపవనాల సీజన్ మొదలై రెండున్నర నెలలు అవుతోంది. జూన్, జూలై నెలల్లో సరైన వర్షాలు కురవలేదు. వరుస అల్పపీడనాలు ఏర్పడడంతో ఆగస్టులోనైనా పరిస్థితి మారుతుందని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. వారి ఆశలన్నీ ఆవిరవుతున్నాయి.
జలధార - జలహారతి ఇక నిరంతర కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
ఉత్తర ఒడిశా, నైరుతీ బంగాళాఖాతాన్ని అనుకుని అల్పపీడనం ఒకటి ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనిపైన ఉపరితల ఆవర్తనం మరోకటి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించారు.
ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండనుండగా, మిగిలిన ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడనున్నట్లు ఐఎండీ తెలిపింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.
రానున్న మూడు గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పిడుగుపాటుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.