Home » HYDRA
మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. రిటర్నింగ్ వాల్ పడిపోవడంతో ఎంజీబీఎస్‌కు వరద పోటెత్తిందని రంగనాథ్ తెలిపారు.
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ఉద్ధృత ప్రవాహానికి గోల్నాకలోని అంబేద్కర్ నగర్ నీటి మునిగింది. దీంతో పలు కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
నగరంలో మూసీ నది ప్రవాహిస్తున్న ఉద్ధృతికి చాల ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది.
మూసి నదిలో పెరిగిన వరద ఉద్ధృతికి పురానాపూల్ శివల ఘాట్ వద్ద ఉన్న శివాలయం మునిగిపోయింది. ఆ సమయంలో దేవాలయంలో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడే చిక్కుకపోయారు.
భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. వర్షాలపై నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కూలగొట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
గాజులరామారంలో కోర్టు సెలవు రోజు చూసుకొని మరీ పేదల ఇళ్లను కూల్చివేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గాజులరామారంలో ఇళ్లు కూల్చివేశారని... రేపు జూబ్లీహిల్స్‌లోని బోరబండ బస్తీకీ రేవంత్ రెడ్డి హైడ్రాతో వస్తారన్నారు.
బిల్డర్స్‌తో హైడ్రా ఎక్కడా లాలూచి పడలేదని తేల్చిచెప్పారు హైడ్రా కమిషనర్. 12 పెద్ద బిల్డర్స్‌పై కేసులు బుక్ చేశామన్నారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాజులరామారంలో ఆదివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ కూల్చివేతల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాజులరామారం పరిధిలోని ప్రభుత్వ సర్వేనెంబర్ - 307లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
కుత్బుల్లాపూర్‌లోని గాజులరామారంలో హైడ్రా బిగ్ ఆపరేషన్ చేపట్టింది. సర్వే నెంబర్ 307లో అక్రమ కట్టడాల కూల్చివేస్తుంది. ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.