HYDRAA Commissioner Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:40 PM
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వద్ద గన్‌మెన్ గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య తన ఇంట్లో గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్: హయత్‌నగర్‌లో గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ (Ranganath) వద్ద గన్‌మెన్(Gunman)గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య (Krishna Chaitanya) ఈరోజు (ఆదివారం) ఉదయం హయత్‌నగర్ (Hayathnagar)లోని తన ఇంట్లో గన్(Gun)తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కామినేని ఆస్పత్రి(Kamineni Hospital)కి తరలించారు. ప్రస్తుతం చైతన్యకు చికిత్స అందిస్తున్న వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు గత రెండేళ్లుగా కృష్ణ చైతన్య బెట్టింగ్ యాప్స్(Betting apps) వల్ల అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ కారణం వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఈ ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'చైతన్యకు కామినేని ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. వైద్యులు సర్జరీ చేస్తున్నారు.. ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉందని అన్నారు. ఫైరింగ్ సమయంలో బుల్లెట్ తల కొంచెం పక్కనుంచి వెళ్లినట్లు వైద్యులు చెబుతున్నారు. చైతన్య బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో వచ్చిన జీతం మొత్తం అప్పులకు కట్టాల్సి రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ఈ కారణంతోనే ఆత్మహత్యకు పాల్పపడి ఉండొచ్చని భావిస్తున్నా. ఈ విషయాన్ని సంచలనం చేయవద్దు' అని చెప్పారు.
ఇవీ చదవండి:
T20 World Cup 2026: టీ20 భారత జట్టు ప్రకటన.. గిల్‌కు షాక్..
నేను కోలుకుంటున్నా.. త్వరలోనే మైదానంలోకి వస్తా: యశస్వి జైస్వాల్