Home » GST
సాధారణ ప్రజలకు శుభవార్త రాబోతుంది. భారత్‌లో జీఎస్టీ (GST) వ్యవస్థలో భారీ మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 4 రకాల పన్ను రేట్లు ఉండగా, ఇకపై వాటిని రెండు ముఖ్యమైన స్లాబ్‌లుగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇకపై ఎక్కువమంది వినియోగించే వస్తువులు, సేవలపై పన్ను తగ్గనుంది.
గత పండుగ సీజన్‌కి ధరలు పెరిగి వినియోగదారులకు భారంగా మారిన క్రమంలో, ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలతో పరిస్థితి మారబోతోంది. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం బుధవారం జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ స్లాబ్ రద్దు లేదా మార్పు అంటూ కేంద్రం గత వారం రోజులుగా ప్రచారం చేసుకుంటుందని చెప్పుకొచ్చారు. వీటి ద్వారానే ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి వస్తుంది అంటూ ప్రాపగాండ చేస్తుందని విమర్శించారు.
జీఎ్‌సటీ రేట్లు తగ్గించనున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రకటించడంతోపాటు ఎస్ అండ్ పీ 18 ఏళ్ల తర్వాత భారత పరపతి రేటింగ్‌ను పెంచడం స్టాక్ మార్కెట్ వర్గాల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది.
ప్రధాని మోదీ ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలతో రేపు స్టాక్ మార్కెట్స్ దూసుకుపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ రేటింగ్‌ను ఎస్ అండ్ పీ సంస్థ పెంచడం, పుతిన్-ట్రంప్ మధ్య సానుకూల చర్చల వంటివన్నీ మార్కెట్‌లో జోష్ నింపుతాయని అంచనా వేస్తున్నారు.
జీఎస్టీ వ్యవస్థను సమూలంగా సంస్కరించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు చేసింది
జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలు తీసుకురానున్నట్టు ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. ఇవి దీపావళి బహుమతులని పేర్కొన్నారు. మరి ఈ సంస్కరణలు ఏమిటో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం కలుగనుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ ఏడాది జూలైలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 7.5 శాతం వృద్ధితో రూ
మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఈ ఏడాది ఆదాయ పన్ను రాయితీలతో ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం.. ఆయా వర్గాలకు మరింత ఉపశమనం కల్పించేందుకు సిద్ధమవుతోంది.
GST Slashed: 12 శాతం శ్లాబ్‌లో మార్పులు తీసుకువస్తే కేంద్ర ప్రభుత్వంపై వేల కోట్ల భారం పడనుంది. దాదాపు 40 వేల కోట్ల నుంచి 50 వేల కోట్ల ఆర్థిక భారం పడనుంది.