Share News

GST Reforms: జీఎస్‌టీలో మలివిడత సంస్కరణలు

ABN , Publish Date - Aug 16 , 2025 | 05:16 AM

జీఎస్‌టీ వ్యవస్థను సమూలంగా సంస్కరించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు చేసింది

GST Reforms: జీఎస్‌టీలో మలివిడత సంస్కరణలు

  • సులభంగా రిజిస్ట్రేషన్లు, రిటర్న్‌ల ప్రక్రియ

న్యూఢిల్లీ: జీఎస్‌టీ వ్యవస్థను సమూలంగా సంస్కరించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు చేసింది. వచ్చే నెలలో జరిగే జీఎ్‌సటీ మండలి సమావేశంలో దీనిపై చర్చజరగనుంది. పన్ను ఎగవేతలు, బోగస్‌ ఇన్వాయి్‌సలతో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) స్వాహాకు చెక్‌ చెప్పేలా ఈ సంస్కరణలు ఉంటాయని అధికార వర్గాలు చెప్పాయి. వేగంగా జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌, రిటర్న్‌ల ప్రాసిసెంగ్‌, రిఫండ్‌ల క్లియరెన్స్‌ ఉండేలా ఈ సంస్కరణలు ఉంటాయని సమాచారం. ఈ సంస్కరణలను అధికార వర్గాలు ‘మలివిడత జీఎ్‌సటీ సంస్కరణలు’గా అభివర్ణించాయి. ఈ సంస్కరణలతో జీఎ్‌సటీ పన్ను చెల్లింపుదారులపై కంప్లయెన్స్‌ (అమలు) భారం తగ్గుతుందని భావిస్తున్నారు.


ఈ సంస్కరణల్లో భాగంగా కొత్త వ్యాపార సంస్థలు, స్టార్టప్‌ కంపెనీల జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే ఎగుమతిదారులు, ఇన్వర్టెడ్‌ డ్యూటీ చెల్లింపు విధానంలో ఉన్న జీఎ్‌సటీ చెల్లింపుదారులతో సహా 80 శాతం రిటర్న్‌ల రిఫండ్స్‌ను, రిటర్న్‌ పైల్‌ చేసిన వెంటనే వేగంగా క్లియర్‌ చేయాలని ప్రతిపాదించారు. ముందుగానే పూర్తి చేసిన రిటర్న్‌ల ద్వారా రిటర్న్‌ల ఫైలింగ్‌ ప్రక్రియ మరింత సులభమవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

Updated Date - Aug 16 , 2025 | 05:16 AM