• Home » Fire Accident

Fire Accident

కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు

కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు

పరిశ్రమలు, కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ హెచ్చరించారు. గత జూలై నెలలో ఎన్టీఆర్‌ జిల్లాలోని బుధవాడ ఆల్ర్టాటెక్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో జిల్లాలోని పరిశ్రమలు, కర్మాగారాల్లో ప్రమాదాలు నివారించేందుకు, భద్రతా ప్రమాణాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు జిల్లాస్థాయి సేఫ్టీ అండ్‌ వెల్ఫేర్‌ అసెస్‌మెంట్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

రెండోరోజు సీఐడీ విచారణ

రెండోరోజు సీఐడీ విచారణ

మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసులో సీఐడీ అధికారులు రెండోరోజు మంగళవారం కూడా విచారణ కొనసాగించారు. సోమవారం రాత్రి సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఆఽధ్వర్యంలో సీఐడీ అధికారులు సబ్‌కలెక్టరేట్‌లో విచారణ చేశారు.

Firecracker Factory: ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి, పారిపోయిన యజమాని

Firecracker Factory: ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి, పారిపోయిన యజమాని

ఓ గోడౌన్‌లో నలుగురు వ్యక్తులు పేలుడు పదార్థాల తయారీలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలోనే పేలుడు సంభవించడంతో పటాకుల తయారీలో నిమగ్నమైన ఇద్దరు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న సీఎం సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

AP News: చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురికి తీవ్రగాయాలు

AP News: చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురికి తీవ్రగాయాలు

చిత్తూరు జిల్లాలోని గంగావరం మండలంలో భారీ పేలుడు సంభవించింది. మారేడుపల్లిలోని బాణాసంచా గోడౌన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పాఠశాలలో ప్రమాదం

పాఠశాలలో ప్రమాదం

ఓ పాఠశాలలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. పాత ఫర్నిచర్‌ దగ్ధమైంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేయడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది.

TG News:హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం

TG News:హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం

భాగ్యనగరంలో అగ్నిప్రమాదం జరిగింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఓ దుకాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Andhra Pradesh: ఉవ్వెత్తిన లేచిన మంటలు..

Andhra Pradesh: ఉవ్వెత్తిన లేచిన మంటలు..

సిగరెట్/ బీడీ తాగే కొందరు నిర్లక్ష్యంగా ఉంటారు. లైటర్‌‌తో వెలిగించి సిగరెట్‌కు అంటించుకొని మజా చేస్తుంటారు. చుట్టుపక్కల ఏం ఉంది..? మంటలు ఎగిసిపడే పెట్రో ఉత్పత్తులు ఉన్నాయా... లేవా అని ఆలోచన చేయరు. ఇంకొందరు పెట్రోల్ బంక్ సమీపంలో స్మోక్ చేసి, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతుంటారు. అనంతపురంలో ఓ వ్యక్తి ఇలానే చేశాడు.

Reactor Explosion: ఎసెన్సియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతులు వీరే..!

Reactor Explosion: ఎసెన్సియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతులు వీరే..!

రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ముగ్గురు మృతిచెందగా.. దాదాపు 25మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు పూడి మోహన్ (20), సీహెచ్ హారిక(22), వై.చిన్నారావు(32)గా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన అనకాపల్లిలోని పలు ఆస్పత్రులకు తరలించారు.

Reactor Explosion: రియాక్టర్ పేలుడుపై సీఎం చంద్రబాబు ఆరా..

Reactor Explosion: రియాక్టర్ పేలుడుపై సీఎం చంద్రబాబు ఆరా..

రాంబిల్లి మండలం అచ్చుతాపురం సెజ్‌లోని ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి వాసంశెట్టి సుభాశ్(Vasamsetti subhash) తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 25మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Reactor Explosion: ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..

Reactor Explosion: ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..

ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 18 మంది గాయపడ్డారు. తీవ్ర గాయాలైన నలుగురు కార్మికులు చనిపోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి