Share News

Fire Accident : ఆర్టీసీ బస్సులో మంటలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Jan 19 , 2025 | 04:51 AM

తిరుపతి నుంచి ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరుకు వెళుతున్న ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు శనివారం వేకువజామున అగ్ని ప్రమాదానికి గురయింది.

Fire Accident : ఆర్టీసీ బస్సులో మంటలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

ఉలవపాడు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నుంచి ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరుకు వెళుతున్న ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు శనివారం వేకువజామున అగ్ని ప్రమాదానికి గురయింది. ముందుగానే గుర్తించడంతో 19 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసుల కథనం మేరకు, శనివారం వేకువజామున ఉలవపాడు జాతీయ రహదారి మన్నేటికోట అడ్డరోడ్డు వద్దకు రాగానే డ్రైవర్‌ రాము బస్సు నిలిపి టీ తాగడానికి వెళ్లాడు. ఓ మహిళ బస్సు వెనుక భాగంలో పొగలు రావడం గమనించి పెద్దగా కేకలు వేసింది. ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగగానే, అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. చూస్తుండగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అర్పారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా బస్సు దగ్ధమైందని ప్రయాణికులను మరో బస్సులో గమ్య స్థానాలకు చేర్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Updated Date - Jan 19 , 2025 | 04:51 AM