Share News

Fire Incident: తిరుమల లడ్డూ కౌంటర్‌లో స్వల్ప అగ్నిప్రమాదం

ABN , Publish Date - Jan 14 , 2025 | 04:03 AM

తిరుమల లడ్డూకౌంటర్‌లో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది.

Fire Incident: తిరుమల లడ్డూ కౌంటర్‌లో స్వల్ప అగ్నిప్రమాదం

తిరుమల, జనవరి13(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూకౌంటర్‌లో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. 47వ నంబరు కౌంటర్‌లోని కంప్యూటర్‌ వైర్‌ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో కౌంటర్ల వద్ద భక్తులు భయబ్రాంతులయ్యారు. విద్యుత్‌ షార్ట్‌సర్యూట్‌తో మంటలు వ్యాపించినట్టు అధికారులు తెలిపారు. సిబ్బంది హుటాహుటిన విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. వైర్లన్నీ తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై విచారించాలని సంబంధిత అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు.

Updated Date - Jan 14 , 2025 | 04:03 AM