Home » Farmers
పసుపు సాగులో రైతులు కొత్తపద్ధతులు అవలంభిస్తున్నారు. పసుపుతో పాటు అంతర పంటగా బొప్పాయి సాగు చేపడుతు న్నారు. డ్రిప్ ఏర్పాటు చేసి నీటి తడులు అందించ డంతో తోటలు ఏపుగా పెరిగి కళకళలాడుతున్నాయి.
జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులను పట్టించుకోలేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రబీపంటకు పైసా కూడా బీమా ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.
రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌పై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు మారుస్తోందని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
జగన్‌కి సానుభూతి నటన తప్ప రైతులపై చిత్తశుద్ధి లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ పాలనలో రైతులు కన్నీళ్లు పెట్టారని విమర్శించారు.
అన్నదాతలకు యూరియా వాడకం తగ్గించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గించే ప్రతి బస్తాకు రూ.800 నేరుగా రైతుకు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఈసారి రైతులకు దీపావళి పండుగకు ముందే గుడ్ న్యూస్ రానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత డబ్బులు పండగకు ముందే రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు సమాచారం.
రైతులకు ప్రస్తుతం యూరియా కొరత తీవ్రంగా ఇబ్బందులు కలిగిస్తోంది. ఎరువుల కోసం గంటల తరబడి క్యూల్లో నిలబడి చివరికి ఖాళీచేతులతో ఇంటికి చేరుతున్న పరిస్థితి. పంటల నిలువ, దిగుబడులపై ప్రభావం చూపుతుందనే ఆందోళన కమ్ముకుంది.
మామిడి రైతుల బ్యాంకు ఖాతాలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈనెల 20-25 తేదీల మధ్య రూ.160 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తామని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.
గత ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని జగన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను అడ్డుకునేందుకే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు, డ్రామాలకు తెరలేపారని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు.
మద్దతు ధర లభించక తల్లడిల్లుతున్న ఉల్లి రైతులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించేందుకు చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం అధికారులు కొనుగోళ్లు మొదలుపెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు.