Home » Election Campaign
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నయా ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం సమావేశం అయ్యారు.
జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అందరికీ అన్నిసార్లు అవకాశం రాకపోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై బీఆర్ఎస్ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులకి నవీన్ యాదవ్ స్ట్రాంగ్ సవాల్ విసిరారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి టూర్ షెడ్యూల్ ఖరారైంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం శనివారం నుంచి హోరెత్తనుంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో ప్రచారంలో స్పీడ్ పెంచాలని అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పలు కీలక సూచనలు చేశారు.
కాంగ్రెస్‌పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బీఆర్కే భవన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పలు అంశాలని ప్రస్తావించారు కేటీఆర్.
రెండేళ్లకే కాంగ్రెస్ మీద ప్రజలకు విరక్తి కలిగిందని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురువేస్తామని ధీమా వ్యక్తం చేశారు రాంచందర్ రావు.
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్‌పై రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ ఇవాళ(సోమవారం) సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో కొత్తగా 79 పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. గతంలో 329 ఉన్న పోలింగ్ స్టేషన్లను 408కి పెంచనున్నామని ఆర్వీ కర్ణన్ వివరించారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. స్పెషల్ సమ్మరీ రివిజన్ షెడ్యూల్‌పై ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ సమావేశమయ్యారు.