Home » Droupadi Murmu
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగోళ్లు ప్రపంచ వ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలిపారని.. హైదరాబాద్‌లో కూడా తెలుగువాళ్లు ఉండటంతో శాంతియుతంగానే నిరసన తెలిపారని లోకేష్ వ్యాఖ్యానించారు.
ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి కర్తవ్య కాల్‌లో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశం దిశగా శీఘ్రగతిన ముందుకు తీసుకువెళ్లాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 2023 సంవత్సరానికి ఎంపిక చేసిన 75 మందికి జాతీయ టీచర్స్ అవార్డులను మంగళవారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రదానం చేశారు.
న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్రం ముద్రించిన రూ.100 స్మారక నాణేం సోమవారం విడుదలకానుంది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నాణెం విడుదల చేస్తారు.
పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఢిల్లీ సర్వీసుల బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారంనాడు ఆమోదముద్ర వేశారు. దీంతో బిల్లు చట్టరూపం సంతరించుకుంది. ఈమేరకు భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.
మణిపూర్‌లో పరిస్థితిని తెలుసుకునేందుకు ఇటీవల ఆ రాష్ట్రంలో పర్యటించిన విపక్ష నేతల కూటమి ఇండియా ప్రతినితి బృందంతో సహా 21 మంది ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బుధవారం ఉదయం 11.30 గంటలకు కలుసుకోనున్నారు. మణిపూర్‌లో పరిస్థితిని రాష్ట్రపతికి వివరించనున్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆగస్టు 5న నీలగిరి జిల్లా ముదుమలైలోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని సం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం (జూలై 17, 2023) వార్షిక సమావేశం (Annual General Body Meeting) జరిగింది. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా లయన్ డాక్టర్ ఏ.నటరాజు బంగారు పతకాన్ని అందుకున్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం మరింత ముదురుపాకాన పడింది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవి అడుగడుగునా అడ్డుపడుతూ అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.
కర్ణాటక రాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu)కు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. జూలై 2న జరిగే
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ వివాదంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలపై ఫిర్యాదు నమోదైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కులాన్ని ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంగా వీరిపై ఈ ఫిర్యాదు నమోదైంది.