Share News

Delhi: రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాసిన ఖర్గే.. అందులో ఏముందంటే

ABN , Publish Date - Feb 26 , 2024 | 02:26 PM

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu)కు లేఖ రాశారు. అగ్నిపథ్ పథకం కారణంగా సాయుధ దళాలలో యువతకు అన్యాయం జరుగుతోందని వారి ఉపాధి పోతోందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Delhi: రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాసిన ఖర్గే.. అందులో ఏముందంటే

ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu)కు లేఖ రాశారు. అగ్నిపథ్ పథకం కారణంగా సాయుధ దళాలలో యువతకు అన్యాయం జరుగుతోందని వారి ఉపాధి పోతోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 2 లక్షల మంది యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆరోపించారు. సదరు లేఖను ఆయన ఎక్స్‌(X)లో షేర్ చేశారు.

"బీజేపీ సర్కార్ సాయుధ దళాల్లో నియామకాల్ని మరింత కఠినతరం చేసింది. దీనికితోడు తాత్కాలికంగా రిక్రూట్‌మెంట్ చేసుకోవడం యువత భవిష్యత్తును అంధకారంలో పడేయటమే. యువత తమ కల సాకారం అవుతుందని ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన అగ్నిపథ్‌తో యువతలో నిరాశ పెరిగిపోయింది. ఎంతో మంది యువత ఆత్మహత్య చేసుకున్నారు. వారికి న్యాయం జరగాలి. సాయుధ దళాల్లో ఎంపికైన వారిని ఈ మధ్య కలిశాను. ప్రభుత్వ చర్యతో దేశ సేవ చేసేందుకు వారు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. 2019-22 మధ్యకాలంలో దాదాపు 2 లక్షల మంది త్రివిధ దళాల్లో చేరారు. ఎన్నో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి వారు కొలువులు సంపాదించారు. జాయినింగ్ లెటర్‌ల కోసం ఎదురు చూశారు. వారి ఆశలను సమాధి చేస్తూ ప్రభుత్వం అగ్నిపథ్ పథకంతో నియామకాలను చేపట్టాలని నిర్ణయించింది. ఈ పథకం తనకు ఆశ్చర్యానికి గురి చేసిందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే ఒక పుస్తకంలో రాశారు. ఈ పథకం వివక్షతో కూడినది. దీని కింద నియమితులైన వారికి 4 సంవత్సరాలే ఉద్యోగం కల్పించి.. తరువాత ఉద్యోగం నుంచి తీసేస్తే.. దేశ వ్యాప్తంగా నిరుద్యోగిత రేటు పెరిగిపోతుంది" అని ఖర్గే లేఖలో పేర్కొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 02:40 PM