Share News

Droupadi Murmu: అయోధ్య రామమందిరంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు....

ABN , Publish Date - May 01 , 2024 | 07:16 PM

అయోధ్యలో కొలువు తీరిన శ్రీరాముడిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం దర్శించుకున్నారు. ఆ క్రమంలో శ్రీరాముడికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్మ అయోధ్య ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.

Droupadi Murmu: అయోధ్య రామమందిరంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు....

అయోధ్య, మే1 : అయోధ్యలో కొలువు తీరిన శ్రీరాముడిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం దర్శించుకున్నారు. ఆ క్రమంలో శ్రీరాముడికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్మ అయోధ్య ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.

Salman Khan: నివాసం వద్ద కాల్పులు: నిందితుడు ఆత్మహత్య

ఆమెకు యూపీ గవర్నర్ అనందిబెన్ పటేల్, రాష్ట్ర మంత్రి సూర్య ప్రతాప్ షాహి స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌‌పోర్ట్ నుంచి నేరుగా అయోధ్యలోని హనుమాన్ ఘారీ దేవాలయాన్ని వెళ్లి.. హనుమంతుని దర్శించుకున్నారు. అనంతరం అయోధ్యలోని రామ మందిరానికి వెళ్లారు. అయితే సాయంత్రం సూర్య మహా హరతి కార్యక్రమంలో ద్రౌపది ముర్ము పాల్గొంటారు. అనంతరం ముర్ము తిరిగి ఢిల్లీకి పయనమవుతారు.

Lok Sabha Elections: నామినేషన్ వేసిన మేనక గాంధీ.. ఆ రెండు స్థానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు


LokSabha Elections: తెలంగాణలో ఓవైసీ.. అసోంలో అజ్మల్: ప్రియాంక గాంధీ

అయితే అయోధ్యకి వెళ్లిన భారత రాష్ట్రపతుల్లో ముర్ము మూడో వారు. అయోధ్యకు వెళ్లిన తొలి రాష్ట్రపతి జ్జానీ జైలు సింగ్. 1983లో భారత రాష్ట్రపతిగా జ్జానీ జైలు సింగ్.. అయోధ్యకు వెళ్లారు. స్థానిక హనుమాన్ ఘారీ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక రెండో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్. 2021లో ఆయన అయోధ్యలోని రామ్ లల్లాలో రామనాథ్ కోవింద్ సందర్శించుకొని.. ప్రార్థనలు చేశారు. ఇక అయోధ్యను సందర్శించిన మూడో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

Lok Sabha Elections: వారణాసిలో మోదీ నామినేషన్.. ముహుర్తం ఖరారు

Read Latest National News And Telugu News

Updated Date - May 01 , 2024 | 07:16 PM