Share News

Mallikarjun Kharge: సైనిక స్కూళ్ల 'ప్రైవేటీకరణ' నిర్ణయంపై రాష్ట్రపతికి ఖర్గే లేఖ

ABN , Publish Date - Apr 10 , 2024 | 09:13 PM

దేశవ్యాప్తంగా సైనిక స్కూళ్లను 'ప్రైవేటుపరం' చేయాలనే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారంనాడు ఒక లేఖ రాశారు. సైనిక స్కూళ్ల ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇందుకు సంబంధించి చేసుకున్న ఎంఓయులను రద్దు చేయాలని కోరారు.

Mallikarjun Kharge: సైనిక స్కూళ్ల 'ప్రైవేటీకరణ' నిర్ణయంపై రాష్ట్రపతికి ఖర్గే లేఖ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సైనిక స్కూళ్లను (Sainik School) 'ప్రైవేటుపరం' చేయాలనే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)కు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) బుధవారంనాడు ఒక లేఖ రాశారు. సైనిక స్కూళ్ల ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇందుకు సంబంధించి చేసుకున్న ఎంఓయు (MoUs)లను రద్దు చేయాలని కోరారు.


ఖర్గే లేఖ సారాంశం

పక్షపాత రాజకీయాలకు దూరంగా సాయుధ బలగాలను సెపరేట్‌గా ఉంచడం భారత ప్రజాస్వామ్యంలో చిరకాలంగా అనుసరిస్తున్న సంప్రదాయమని, దీనిని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని ఖర్గే తన రెండు పేజీల లేఖలో ఆరోపించారు. ''ఒక సంస్థ తరువాత మరో సంస్థను బలహీనపరుస్తూ, ఆర్ఎస్ఎస్ గ్రాండ్ వ్యూహంలో భాగంగా సాయుధ బలగాల సహజ స్వభావాన్ని, నైతికతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సైనిక స్కూళ్ల జాతీయ స్వభావాన్నే దెబ్బతీయనుంది'' అని ఖర్గే తెలిపారు. జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రైవేటీకరణ విధానాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని, ఎంఓయూలు చెల్లనివిగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోందని అన్నారు. జాతికి సేవలందించడంలో సాయుధ బలగాల స్కూళ్లకు ప్రత్యేక గౌరవం, విశిష్టత ఉన్నాయని గుర్తు చేశారు.

Lok Sabha Elections: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాక్..!


కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పీపీపీ మోడల్‌ కింద ప్రైవేట్ స్కూళ్ల ప్రైవేటీకరణ జరుగుతున్నట్టు ఆర్టీఐ రిప్లయ్ ఆధారిత ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఆధారంగా తమకు తెలియవచ్చిందని ఖర్గే తన లేఖలో రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం 62 శాతం సైనిక స్కూళ్లు బీజేపీ-ఆర్ఎస్ఎస్ లీడర్లు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోందన్నారు. ఈ చర్య నేషనల్ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీలకు కేడెట్లను పంపడంలో కీలక పాత్ర పోషిస్తున్న సైనిక స్కూళ్ల స్వతంత్రను దెబ్బతీయడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. 1961లో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ సైనిక స్కూళ్లను ఏర్పాటు చేశారని, అప్పటి నుంచి మిలటరీ లీడర్‌షిప్, ఎక్సలెన్స్‌కు మారుపేరుగా సైనిక స్కూళ్లు నిలుస్తున్నాయన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ కింద అటానమస్ బాడీగా ఉన్న సైనిక్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో దేశంలోని 33 సైనిక స్కూళ్లు పూర్తిగా గవర్నమెంట్-ఫండెడ్ ఇన్‌స్టిట్యూషన్లుగా నడుస్తున్నాయని తన లేఖలో ఖర్గే వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2024 | 09:13 PM