Home » Donald Trump
ట్రంప్ చేయి మణికట్టు కింద ఎర్రగా కందిపోయినట్టు ఉన్న ఫొటోలు మళ్లీ వైరల్‌గా మారాయి. అయితే, ట్రంప్ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకాలేదని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి.
అమెరికా టెక్ సంస్థలపై డిజిటల్ ట్యాక్స్ విధించే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. అమెరికాకు, అమెరికా కంపెనీలకు సముచిత గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అదనపు సుంకాలు విధింపుపై అమెరికా బహిరంగ నోటీసు విడుదల చేసింది. ఆగస్టు 27 అర్ధరాత్రి 12.01 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
మరి కొద్ది రోజుల్లో భారత వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలు అమలుకానున్న వేళ భారత్ ఆ దేశంలో రెండో లాబీయింగ్ సంస్థను నియమించింది.
భారత్‌పై ప్రస్తుతం 25 శాతం టారిఫ్‌లు అమలవుతుండగా, బుధవారం నుంచి అదనంగా విధించిన 25 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు జరుగనున్న అత్యున్నత స్థాయి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ట్రంప్ అధిక సుంకాలతో అమెరికా విత్త లోటు వచ్చే పదేళ్లల్లో 3.3 ట్రిలియన్ డాలర్ల మేర తగ్గే అవకాశం ఉందని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీసు నివేదికలో వెల్లడైంది. ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీల్లో కూడా 0.7 ట్రిలియన్ డాలర్ల మేర కోత పడే అవకాశం ఉంది.
నాగ్‌పూర్‌లో జరుగుతున్న మార్బత్ పండగ.. ట్రంప్ సుంకాలపై నిరసనలకు వేదికైంది. స్థానికులు ట్రంప్ దిష్టిబొమ్మను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
అమెరికాకు చెందిన అంతర్జాతీయ సెమీకండక్టర్ల (చిప్) తయారీ దిగ్గజం ఇంటెల్ కార్ప్‌లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 10 శాతం వాటా చేజిక్కించుకుంది.
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిలా విదేశాంగ విధానాన్ని ఇంత బహిరంగంగా నిర్వహించిన ఏ అధ్యక్షుడిని గతంలో చూడలేదని జైశంకర్ అన్నారు. వాణిజ్య అంశాలతో పాటు వాణిజ్యేతర వ్యవహారాలకు టారిఫ్‌లు వినియోగిస్తుండటం కొత్తగా ఉందని ఉన్నారు.
ట్రంప్ సర్కారు కఠిన వైఖరి కారణంగా అమెరికాలోకి వలసలు భారీగా తగ్గాయని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో వలసలు ఏకంగా 1.5 మిలియన్‌ల మేర తగ్గినట్టు సంస్థ అధ్యయనంలో తేలింది. ఫలితంగా జనాభాలో వలసదారుల వాటా 15.8 శాతం నుంచి 15.4 శాతానికి పడిపోయింది.