Share News

Donald Trumps Peace Plan: ఇదిగో శాంతి.. ఏదీ బహుమతి

ABN , Publish Date - Oct 10 , 2025 | 05:30 AM

గాజాలో రెండేళ్లుగా కొనసాగుతున్న మారణహోమానికి తెరపడేందుకు రంగం సిద్ధమైంది. నోబెల్‌ శాంతి బహుమతిపై ఆశతో గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రస్థాయిలో చేసిన ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి....

Donald Trumps Peace Plan: ఇదిగో శాంతి.. ఏదీ బహుమతి

  • ట్రంప్‌ శాంతి ప్రణాళిక తొలిదశ అమలుకు ఇజ్రాయెల్‌, హమాస్‌ ఓకే

  • నోబెల్‌ శాంతి బహుమతి ఆశతో ఇరువర్గాలపై ట్రంప్‌ తీవ్ర ఒత్తిడి!

  • చర్చల తర్వాత పలు అంశాలపై స్పష్టత

  • పరస్పరం బందీల విడుదలకు ఏర్పాట్లు

  • ఇక గాజాలో శాశ్వత శాంతి: ట్రంప్‌

  • దేవుడి దయతో మా వాళ్లు తిరిగొస్తున్నారు: నెతన్యాహు

  • ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ పాటించేలా చూడాలి: హమాస్‌

  • ట్రంప్‌తో మాట్లాడి అభినందించా: మోదీ

వాషింగ్టన్‌, అక్టోబరు 9: గాజాలో రెండేళ్లుగా కొనసాగుతున్న మారణహోమానికి తెరపడేందుకు రంగం సిద్ధమైంది. నోబెల్‌ శాంతి బహుమతిపై ఆశతో గాజాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రస్థాయిలో చేసిన ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. ట్రంప్‌ ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక తొలిదశ అమలుకు ఇజ్రాయెల్‌, హమాస్‌ అంగీకరించాయి. ప్రస్తుతానికి యుద్ధాన్ని నిలిపివేసి, పరస్పరం బందీలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించాయి. దీనిపై ట్రంప్‌ గురువారం ఉదయం (అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం) ‘ట్రుత్‌’ సోషల్‌లో పోస్టు పెట్టారు. ‘‘గాజాలో శాంతి ప్రణాళిక మొదటి దశకు ఇజ్రాయెల్‌, హమాస్‌ అంగీకరించాయి. ఇరువర్గాలు తమ వద్ద ఉన్న బందీలను త్వరలోనే విడుదల చేస్తాయి. ఇజ్రాయెల్‌ తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటుంది. గాజాలో శాశ్వత శాంతి దిశగా ఇదొక ముందడుగు. ఈ వ్యవహారంలో అందరినీ సమానంగా చూస్తాం..’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అనంతరం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ, హమాస్‌ కూడా శాంతి ప్రణాళిక తొలిదశ అమలుపై ప్రకటనలు చేశాయి. అంతకుముందు ఈజి్‌ప్టలో జరిగిన శాంతి చర్చల్లో అమెరికా రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌, ట్రంప్‌ అల్లుడు జేర్‌డ్‌ కుష్నర్‌, ఈజిప్ట్‌, టర్కీ, ఖతార్‌ దేశాల ప్రతినిధులు, ఇజ్రాయెల్‌ ప్రధాని సలహాదారు రాన్‌ డెర్మర్‌ పాల్గొన్నారు. ఆ సమయంలో ట్రంప్‌ వైట్‌హౌజ్‌లో ఓ సమావేశంలో ఉన్నారు. ఆ సమయంలో విదేశాంగ మంత్రి మార్కో రూబియో ట్రంప్‌ వద్దకు వెళ్లి ఒక నోట్‌ చూపించి, శాంతి ఒప్పందం విషయం చెప్పారు. తర్వాత ట్రంప్‌ ఈ అంశంపై పోస్టు పెట్టారు. కాగా శాంతి ప్రక్రియ మొదలైందని, హమాస్‌ వద్ద బందీలుగా ఉన్న తమవారు దేవుడి దయతో తిరిగివస్తున్నారని నెతన్యాహూ పేర్కొన్నారు. మరోవైపు గాజాలో యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి అంగీకరించామని హమాస్‌ ప్రకటించింది. ఇక ఇజ్రాయెల్‌ దళాల ఉప సంహరణ, బందీల విడుదల, గాజాకు మానవతా సాయం కోసం మార్గాలను తెరవడానికి ఒప్పందం కుదిరిందని తెలిపింది. అయితే శాంతి ఒప్పందంలోని షరతులను ఇజ్రాయెల్‌ కచ్చితంగా అమలు చేసేలా చూడాలని ట్రంప్‌కు, మధ్యవర్తిత్వం వహించిన దేశాలకు హమాస్‌ విజ్ఞప్తి చేసింది. క్తం చేశాయి.


కాగా, శాంతి ఒప్పందంపై బ్రిటన్‌, ఇటలీ ప్రధానులు స్టార్మర్‌, జార్జియా మెలొని.. తుర్కియే, ఈజిప్ట్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షులు ఎర్డోగాన్‌, అబ్దెల్‌ ఎల్‌సిస్సి, మేక్రాన్‌ హర్షం వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందం పూర్తిస్థాయిలో అమలయ్యేలా ఐక్యరాజ్యసమితి సహకరిస్తుందని.. పాలస్తీనా ప్రజలకు మానవతా సాయంతోపాటు గాజా పునర్నిర్మాణానికి తోడ్పడుతామని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రకటించారు. చైనా, జోర్డాన్‌, సౌదీ అరేబియా, లెబనాన్‌, నెదర్లాండ్స్‌, కెనడా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, జపాన్‌ తదితర దేశాలు కూడా ఒప్పందంపై హర్షం వ్యబందీల విడుదల.. సైన్యం వెనక్కి..శాంతి ప్రణాళిక తొలిదశలో భాగంగా హమాస్‌ తమ వద్ద బందీలుగా ఉన్న 20 మంది ఇజ్రాయెలీలను విడుదల చేస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్‌ వద్ద బందీలుగా ఉన్న సుమారు 2 వేల మంది పాలస్తీనీయులను వదిలిపెట్టనుంది. అందులో ఇజ్రాయెల్‌ గతంలోనే అరెస్టు చేసి దీర్ఘకాలిక శిక్షలు వేసినవారు 250 మందికిపైగా ఉండగా, మరో 17 వందల మంది గత రెండేళ్లలో అదుపులోకి తీసుకున్నవారు ఉన్నట్టు హమాస్‌ వర్గాలు తెలిపాయి. ఇక శాంతి ఒప్పందంలో భాగంగా గాజా సిటీ, ఖాన్‌ యూనిస్‌, రఫా నగరాల నుంచి ఇజ్రాయెల్‌ సైన్యం వెనక్కి వెళుతుంది. శాంతి ప్రణాళికలో భాగంగా.. ఇక ముందు హమాస్‌ ఆయుధాలు వదిలేయడం, గాజా పరిపాలనను పాలస్తీనా అథారిటీకి అప్పగించడం వంటి చర్యలు అత్యంత కీలకంగా మారాయి. కాగా, ఐక్యరాజ్యసమితి శాంతి దళాలకు అమెరికా ఇచ్చే నిధులను గణనీయంగా తగ్గించడంతో.. శాంతి పరిరక్షణ దళాలను 25శాతం మేర తగ్గించుకుంటున్నట్టు ఐక్యరాజ్యసమితి సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.


గాజాలో శాశ్వత శాంతి నెలకొంటుంది: మోదీ

ఇజ్రాయెల్‌, హమాస్‌ ఒప్పందంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ట్రంప్‌ శాంతి ప్రణాళిక తొలిదశ అమలు ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాం. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ గొప్ప నాయకత్వానికి ప్రతీక ఇది. బందీల విడుదల, గాజా ప్రజలకు మానవతా సాయం సాఫీగా సాగాలని.. శాశ్వత శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తున్నా’’ అని గురువా రం మధ్యాహ్నం ఎక్స్‌లో పోస్టు చేశారు. అందులో ట్రంప్‌పై ఎలాంటి ప్రశంసలు చేయలేదు. కానీ గురువారం రాత్రి మోదీ మరో ట్వీట్‌ చేశారు. ‘‘నా స్నేహితుడు ట్రంప్‌తో మాట్లాడాను. గాజా శాంతి ప్రణాళికపై అభినందించాను. భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చల పురోగతిపైనా చర్చించాం. తరచూ సంప్రదింపులు జరుపుతూ ఉందామని నిర్ణయించాం’’ అని మోదీ పేర్కొన్నారు. అలాగే ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూకు కూడా ఫోన్‌ చేసి అభినందించానని తెలిపారు. కాగా, మోదీ ఫోన్‌ చేసినప్పుడు కీలక కేబినెట్‌ భేటీలో ఉన్న నెతన్యాహూ.. దాని ఆపి వెళ్లి మరీ మోదీతో మాట్లాడారని నెతన్యాహూ కార్యాలయం పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కుప్పకూలిన పోలీస్ అధికారి.. అసలేమైందంటే..

రైతులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.5000 పెన్షన్..

Updated Date - Oct 10 , 2025 | 06:54 AM