Home » Diwali 2025
‘దీపావళి’ అంటే దీపాల వరుస అని అర్థం. ఈ పర్వదినం చీకటిపై వెలుగు, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోజున ప్రజలంతా దీపాలను వెలిగించి, వాటిని శ్రీకృష్ణునికి సమర్పించి, ఆపై ఇంటి ప్రాంగణంలో వరుసలలో అమర్చుతారు.
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. దీపావళి ప్రాశస్త్యాన్ని తెలియచెబుతూ సీఎం..
దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ నరకాసురులు మారీచుల్లాంటివారని, రూపాలు మార్చుకుంటూ తమను ఓడించారనే అక్కసుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
దీపావళి ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసం చివరలో వచ్చే పండుగ. పురాణాల్లో ఈపండగ ఆనవాళ్లున్నాయి. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రజలాల్లో ముంచే శాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహావతార మెత్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి, దీపావళి పండుగ సందర్భంగా తన కుటుంబంతో మార్కెట్‌లో షాపింగ్ చేశారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి..
సంగారెడ్డి జిల్లా, ఆందోల్ శివారులోని టపాసుల గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తి అగ్గి రాజేయడంతో మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
దీపావళికి ముందు ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం బాణాసంచా(ఫైర్ క్రాకర్స్)ను నిషేధించింది. అన్ని రకాల సౌండ్, ఫైర్‌క్రాకర్ల తయారీ, విక్రయం, పేల్చడాన్ని పూర్తిగా నిషేధించింది. బదులుగా లైట్ డిస్‌ప్లేలు, డియోలు, ఇతర పర్యావరణ హితమైన..
దీపావళి సమయంలో కాలుష్య స్థాయిలు పెరుగుతాయి. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి, గర్భిణులు తమ ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆరోగ్య నిపుణుల నుంచి తెలుసుకుందాం..
ఈ దీపావళికి మీ ఇంట్లో దీపాలు ఎక్కడ వెలిగించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? దీపావళి నాడు లక్ష్మీ పూజతో పాటు దీపాలు వెలిగించడం వల్ల ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సానుకూలత ఆకర్షిస్తుంది. కాబట్టి, ఇంట్లో ఏ ప్రదేశాల్లో దీపం వెలిగిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
హిందూ మతంలో, శనిదేవుడిని న్యాయ దేవుడిగా భావిస్తారు. ఆయన ప్రతి వ్యక్తికి వారి కర్మల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు. అయితే, శనిదేవుడిని పూజించేటప్పుడు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.